Begin typing your search above and press return to search.

కొత్త‌మ్మాయ్ తుళ్లింత ఉప్పెననే త‌ల‌పిస్తోంది!

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:44 AM GMT
కొత్త‌మ్మాయ్ తుళ్లింత ఉప్పెననే త‌ల‌పిస్తోంది!
X
మెగా మేన‌ల్లుడు.. సాయి తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఉప్పెన అనేది టైటిల్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైటిల్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో క్యూరియాసిటీ పెంచాడు. తొలి పోస్ట‌ర్ తోనే వైష్ణ‌వ్ పాత్ర ఎలా ఉంటుందో రివీలైంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ ఇది. వైష్ణ‌వ్ జాల‌రి యువ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అధినేత‌ సుకుమార్ ర‌చ‌నా సాయం ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం కానుంది.

తాజాగా కొత్త‌ పోస్ట‌ర్ లో హీరోయిన్ కృతిశెట్టిని ప‌రిచయం చేసారు. నేటి రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా కృతి పోస్ట‌ర్ ను రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తొల‌క‌రి జ‌ల్లులో క‌న్నె పిల్ల తుళ్లింత ఎలా ఉంటుందో ఈ పోస్ట‌ర్ లో ఎలివేట్ చేశారు. కృతి ఎంతో ఉల్లాసంగా ఓ బ‌స్సు ముందు చున్నీ గాల్లోకి ఎగ‌రేయ‌డ‌మే కాదు.. ప్రేమైక లోకంలో విహ‌రిస్తూ.. ఎగిరి గంతేస్తోన్నట్లుగా చూపించారు. తొలి పోస్ట‌ర్ లో స‌ముద్రం ముందు హీరోను ను... మ‌లి పోస్ట‌ర్ లో వ‌ర్షం చినుకుల్లో త‌డుస్తున్న హీరోయిన్ ను చూపించ‌డం తోనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనే అనిపిస్తోంది.

మేకింగ్ ప‌రంగాను సీనియ‌ర్ టెక్నిషీయ‌న్స్ అండ‌దండ‌లు ఈ సినిమాకి అస్సెట్ కానున్నాయి.ఇక‌పై టీజ‌ర్ .. ట్రైల‌ర్ తో అంచానాలు పెంచాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్త‌యింది. ఇందులో త‌మిళ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ప్ర‌తినాయ‌కుడు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. వైష్ణవ్-విజ‌య్ పాత్ర‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్- మైత్రీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.