తీన్మార్ బ్యూటీ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది

Sun Mar 29 2020 01:00:01 GMT+0530 (IST)

Kriti Kharbanda on Pulkit Samrat

తెలుగు ఇంకా తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కృతి కర్బంద ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ నటిగా మారిపోయింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఈ అమ్మడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్న నేపథ్యంలో ఈమె బిజీ బిజీగా మారిపోయింది. ఇదే సమయంలో ఈ అమ్మడు నటుడు పుల్కిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్నాయి.వీరిద్దరు కలిసి పాగల్ పంగ్తి చిత్రంలో నటించారు. ఈ జంట గత కొన్ని రోజులుగా పలు వేదికలపై కలిసి కనిపించడంతో పాటు పబ్ లు క్లబ్ లు అంటూ తిరిగారు. అందుకే వీరిద్దరు ఈ ఏడాదిలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. పెళ్లి విషయమై ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై కృతి కర్బంద స్పందించింది.

మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టి పారేసింది. ప్రస్తుతానికి పెళ్లి ఉద్దేశ్యం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. పుల్కిత్ ఇంకా పెళ్లికి సిద్దం కాలేదని కెరీర్ విషయంలో సీరియస్ గా ఉన్నాడని నేను కూడా ఇంకా కెరీర్ పై దృష్టి  పెట్టి వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇద్దరికి కూడా పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎప్పుడు ఎన్నాళ్లకు పెళ్లి చేసుకునే విషయంపై అయితే క్లారిటీ ఇవ్వలేదు కాని ఇద్దరం రిలేషన్ లో ఉన్నట్లుగా మాత్రం అనధికారికంగా ఒప్పేసుకుంది.