48 గంటల బాధ.. పవన్ హీరోయిన్ ఎమోషనల్

Tue May 04 2021 11:00:44 GMT+0530 (IST)

Kriti Kharbanda Emotional tweet On Corona Virus

కరోనా అనేది మన వరకు వస్తే కాని దాని సీరియస్ నెస్ తెలియడం లేదు. ఎప్పుడు అయితే కరోనా అనేది మనకు లేదా మన ఇంట్లో వారికి వస్తుందో అప్పుడు దాని వల్ల ఎదురయ్యే బాధలు మరియు ఇబ్బందులు అర్థం అవుతున్నాయి. అందుకే కరోనా పెయిన్ ను అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి సీరియస్ నెస్ ను అర్థం అయ్యేలా జనాలకు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కరోనాను ఎదుర్కొన్న వారు వారి అనుభవాలు షేర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అంటూ సూచిస్తున్నారు. తాజాగా పవన్ హీరోయిన్ కృతి కర్బంద తన జీవితంలో కరోనా తో పడ్డ బాధ గురించి చెప్పుకొచ్చింది.ట్విట్టర్ లో కృతి కర్బందా.. మీకు తెలియదు కరోనా అనేది మీ ఇంటికి వచ్చే వరకు అది ఎంత ప్రమాదకరమో. నేను మరియు నా కుటుంబ సభ్యులు 48 గంటల పాటు అనుభవించిన బాధ దారుణం. నరకం అనుభవించాం. అందుకే దయచేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు మీ పరిస్థితి మీ కుటుంబం పరిస్థితిని గురించి ఆలోచించండి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దు. మీరు ఈ రోజు ఇంట్లో ఉంటేనే ముందు ముందు ఏ పని అయినా చేసుకునే వీలు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.

టాలీవుడ్ లో పవన్ తో తీన్ మార్ సినిమా ను చేసిన ఈమె ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. కాని ఇక్కడ పెద్దగా గుర్తింపును దక్కించుకోలేక పోయింది. దాంతో ఆమె బాలీవుడ్  వైపు అడుగులు వేసింది. అక్కడ అడపా దడపా సినిమా లు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి కర్బందా జనాల్లో అవగాహణ మార్పు రావడం కోసం తన అనుభవంను షేర్ చేసుకోవడం అభినందనీయం.