ప్రేమలో ఉన్నట్లుగా ఒప్పుకుంది

Tue Nov 19 2019 16:01:59 GMT+0530 (IST)

Kriti Kharbanda Confirms Her Love

బోణీ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బందా తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో కన్నడంలో ఈ అమ్మడు ప్రయత్నించింది. అక్కడ అడపా దడపా చిత్రాల్లో నటించిన ఈమెకు బాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది. ఇటీవలే బాలీవుడ్ లో 'హౌజ్ ఫుల్ 4' చిత్రంతో ఈమెకు సక్సెస్ దక్కింది. బాలీవుడ్ లో మెల్ల మెల్లగా నిలదొక్కుకుంటున్న ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.తన ప్రేమ వార్తలపై స్పందించిన కృతి కర్బందా క్లారిటీ ఇచ్చింది. ఔను నేను ప్రేమలో ఉన్నాను. నా ప్రేమ గురించి దాయాల్సిన అవసరం ఏమీ లేదు. నా ప్రేమ గురించి నా తల్లి దండ్రులకు కూడా తెలుసు. త్వరలోనే మేమిద్దరం ఒక్కటి కాబోతున్నామని... మా కుటుంబ సభ్యులు మా ప్రేమను అంగీకరించారు అంటూ కృతి పేర్కొంది. అయితే ఆమె ప్రియుడి గురించిన పూర్తి వివరాలను మాత్రం ఆమె చెప్పలేదు. ప్రేమలో ఉన్న విషయంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ కృతి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.