Begin typing your search above and press return to search.

బేబమ్మ ఒక మంచి నిర్ణయం..!

By:  Tupaki Desk   |   29 Jan 2023 5:00 AM GMT
బేబమ్మ ఒక మంచి నిర్ణయం..!
X
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టి మొదటి సినిమా హిట్ పడే సరికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ టైం లో కథ గురించి పెద్దగా పట్టించుకోకుండానే సినిమాలు సైన్ చేసింది అమ్మడు.

ఉప్పెన తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు రెండు హిట్లు పడ్డాయి. హ్యాట్రిక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉంది అనుకున్న టైం లోనే ఆ వెంటనే హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రామ్ తో ది వారియర్, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ మాచర్ల నియోజకవర్గం ఈ 3 సినిమాలు కృతి శెట్టికి పెద్ద షాక్ ఇచ్చాయి.

అందుకే ఇక మీదట కథల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని అనుకుంటుంది కృతి. అంతేకాదు స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాలిక్యులేషన్స్ కూడా వేసుకుంటుందని తెలుస్తుంది. మ్యాగ్జిమం లవ్ స్టోరీస్ కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తుందట.

కమర్షియల్ సినిమాల్లో కూడా తన పాత్రకు వెయిట్ ఉంటేనే సినిమాకు ఓకే చెప్పాలని అనుకుంటుందట. కృతి శెట్టి నిర్ణయం వెనుక తన ఫ్లాపులే కాదు కెరీర్ రిస్క్ లో పడితే ఛాన్స్ లు వస్తాయో రావో అన్న ఆలోచన కూడా ఉందని తెలుస్తుంది. వరుసగా హిట్లు కొట్టినప్పుడు కన్నా ఫ్లాపులు పడినప్పుడే కెరీర్ మీద భయం ఏర్పడుతుంది.

3 ఫ్లాపుల అనంతరం అమ్మడు తన ఆలోచనని మార్చుకుంది. కథలో విషయం ఉంటేనే సినిమా ఓకే చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య కస్టడీ సినిమాలోనే చేస్తున్న కృతి ఇప్పటివరకు ఇంకా ఏ తెలుగు సినిమాకు ఓకే చెప్పలేదు. అయితే ఈ మధ్యనే మళయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది అమ్మడు. టోవినో థామస్ తో ఒక సినిమా చేస్తుంది. పీరియాడికల్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో కృతి పాత్ర అదిరిపోతుందని అంటున్నారు.

కృతి శెట్టి ఇలా వెంట వెంట సినిమాలు చేయకపోవడం కథల విషయంలో జాగ్రత్త పడటం మంచిదే కానీ మరీ గ్యాప్ ఎక్కువైతే ఆడియన్స్ మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది. వరుస వెంట సినిమాలు చేయాలి కానీ అందులో తన పాత్ర బాగా ఉండేట్టు చూసుకుంటే బెటర్. మొత్తానికి కృతి శెట్టి తిరిగి మళ్లీ ఫాం లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. అమ్మడి ఖాతాలో అర్జెంట్ హిట్ పడే వరకు టెన్షన్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.