రీమేక్ తో వస్తున్న క్రియేటీవ్ డైరెక్టర్

Wed Oct 16 2019 19:09:59 GMT+0530 (IST)

'నక్షత్రం' సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎట్టకేలకు సినిమా చేయబోతున్నాడు. తన నెక్స్ట్ సినిమాకు ఓ రీమేక్ ను ఎంచుకున్న కృష్ణ వంశీ తాజాగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసి రీమేక్ అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.2016 లో మరాఠీ లో వచ్చిన 'నట సామ్రాట్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాలో నానా పటేకర్ చేసిన క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ నటిస్తుండటం విశేషం.అలాగే రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది. ఇక నట సామ్రాట్ లో మ్రున్మయి చేసిన రోల్ కి తెలుగులో అవికా గోర్ ను తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయన్ని కూడా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను అభిషేక్ జవ్కర్  - మధు కళిపు సంయుక్తంగా నిర్మించనున్నారు. మరి గ్యాప్ తర్వాత ఈ రీమేక్ సినిమాతో వస్తున్న కృష్ణ వంశీ హిట్టు కొట్టి మళ్ళీ ఫాంలోకి వస్తాడా ..చూడాలి.