స్టార్ డాటర్ ఒళ్లంతా పచ్చబొట్లే.. కన్నార్పగలరా?

Tue Jul 07 2020 11:15:53 GMT+0530 (IST)

Krishna Shroff Stunning Pose In Beach

బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్ కుమార్తె.. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఇస్పీడ్ గురించి తెలిసిందే. బోయ్ ఫ్రెండ్ తో ఈ అమ్మడి బికినీ బీచ్ ట్రీట్ గురించి నెటిజనులకు పరిచయం చేయాల్సిన పనే లేదు. కృష్ణా రెబలియన్ యాటిట్యూడ్ రెగ్యులర్ ఫోటో ట్రీట్ తోనే నెటిజనుల్లో పాపులరైంది. ఇక ఇన్ స్టా మాధ్యమంలో ష్రాఫ్ గాళ్ ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉండదు.తాజాగా తన ప్రియుడు ఎబాన్ ను ముద్దుపెట్టుకున్న ఫోటోలను కృష్ణా సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. స్టన్నింగ్ అనిపించే బికినీ చిత్రాలతో ఆమె సెగలు పుట్టించింది. కృష్ణ ప్రియుడితో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో నిరంతరం బిజీ బిజీ గా గడిపేస్తోంది.

ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ లో తన ప్రియుడితో షికార్ చేస్తున్నప్పటి ఫోటో ఇది. త్రోబాక్ ఫోటోనే అయినా ఆమె పచ్చబొట్ల వైపే చూస్తూ యువతరం కన్నార్పకుండా స్టక్ అయిపోతున్నారు. హాట్ బ్లాక్ బికినీలో కృష్ణ పోజులివ్వగా.. ఆమె ప్రియుడు ఎబాన్ హైమ్స్ ఆమెను కౌగిలించుకుని ఉన్నాడు. కృష్ణ తన ప్రియుడితో కలిసి బీచ్ లకే అంకితమైపోతోంది. `బీచ్.. ప్లీజ్` అంటూ కలవరించేస్తోంది ప్రతిరోజూ. ఈ త్రోబ్యాక్ ఫోటోకి  ప్రియుడు ఎబాన్ అందమైన ఎమోజీలతో ప్రతిస్పందించాడు. ఇక జాకీష్రాఫ్ తనయ సినిమాల్లో నటించేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేదు. కానీ అంతర్జాలంలో కథానాయికల్ని మించి వేడి పెంచేస్తూ హాట్ టాపిక్ గా మారింది.