కృష్ణ కృష్ణ.. పుట్టినరోజున ఆ బికినీ షోలేమిటో?

Fri Jan 22 2021 11:40:32 GMT+0530 (IST)

Krishna Shroff Latest Stunning Pose In Bikini

బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ అన్నలానే పర్ఫెక్ట్ జిమ్నాస్ట్ అన్న సంగతి తెలిసిందే. నిరంతరం జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తూ అన్న టైగర్ తోనే పోటీపడుతుంది. ఇక మరో కండరగండడు ఎబాన్ తో డేటింగ్ కూడా చేసింది. బాలీవుడ్ హాటెస్ట్ గాళ్స్ జాబితాలో ఉన్న కృష్ణ ష్రాఫ్ పర్ఫెక్ట్ టోన్డ్ ఫిట్ బాడీతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిస్తుంది. ఇంతకుముందు కృష్ణ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ .. బోయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి.తాజాగా తన 28వ బర్త్ డే జరుపుకుంటున్న వేళ కృష్ణా ష్రాఫ్ ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయిపోయింది. ఇందులో ఆల్మోస్ట్ బికినీ లో కనిపించిన కృష్ణ తన కండలు తిరిగిన శరీరాన్ని బయల్పరిచింది. ఇక ఆ ఒంటిపై టాట్టూలన్నీ హైలైట్ గా కనిపిస్తున్నాయి.

గురువారం నాటికి 28 ఏళ్లు. బర్త్ డే వేళ బికినీలో తన మెరిసే ఆబ్స్  సెక్సీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో కృష్ణ ష్రాఫ్ ఒక గదిలోని అద్దం ముందు సెల్ఫీ క్లిక్ చేస్తూ కనిపించింది. ``28 నాకు.. బాగా కనిపిస్తోంది. # బర్త్‌డే సూట్`` అంటూ వ్యాఖ్యను జోడించింది. ఈ ఫోటోపై టైగర్ ష్రాఫ్ మాజీ గాళ్ ఫ్రెండ్ దిశా పటానీ వరుస ఫైర్ ఎమోజీలను జోడించింది. నా అందమైన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు ... ప్రతి కోణంలోనూ అందంగా ఉన్నావు... నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను.. అంటూ కృష్ణ ష్రాఫ్ తల్లిగారైన అయేషా ష్రాఫ్ ఎమోషన్ కి గురయ్యారు.

``ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండు. మీ తదుపరి సెలవుదినం జీవితంలో ఎక్కడ ఉండాలో మాత్రమే మీరు నొక్కి చెప్పవచ్చు..`` అంటూ టైగర్ ష్రాఫ్ తన పోస్ట్ లో రాశారు.

కృష్ణ ష్రాఫ్ 2019 లో బోయ్ ఫ్రెండ్ ఎబాన్ హయామ్స్ నుంచి విడిపోయారు. గత నెలలో కృష్ణ ష్రాఫ్ తన .. చెఫ్ నుస్రెట్ గోక్సే అకా సాల్ట్ బే  చిత్రాన్ని తన రెస్టారెంట్ నుండి పోస్ట్ చేసి.. దానికి ఆసక్తికర శీర్షికను పెట్టారు. `బే సమయం` అంటూ..  ఆమె పోస్ట్‌పై స్పందిస్తూ సిడ్నీలో నివసించే ఎబాన్ హైమ్స్ ఇలా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ జంట కొన్ని వారాల్లోనే విడిపోయారు. నవంబరులో కృష్ణ ష్రాఫ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఎబాన్ హైమ్స్ తో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ నుండి ఎబాన్ పోస్ట్ లను తొలగించింది. దయచేసి నన్ను ఎబాన్ తో కలపొద్దు.. మేము ఇకపై కలిసి లేము అని అభిమానులకు వెల్లడించింది.