హీరోగారి చెల్లెమ్మ బికినీ సెలబ్రేషన్

Wed Nov 20 2019 19:28:45 GMT+0530 (IST)

Krishna Shroff In Bikini

ఒళ్లంతా పచ్చ బొట్లు పొడిపించుకోవడమే కాదు.. తన అభిరుచికి తగ్గట్టే టాట్టూ కింగ్ లాంటి కుర్రాడితోనే లవ్ లో పడింది ఈ అమ్మడు. సదరు హీరోగారి చెల్లెమ్మ ప్రియుడితో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో తలమునకలుగా ఉన్నప్పటి ఫోటోలపై నిరంతరం ఏదో ఒక చోట అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. ఆమె ఇన్ స్టా ఫోటోల్ని వైరల్ గా షేర్ చేస్తుంటారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో కథానాయికగా అడుగు పెట్టకపోయినా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్లను మించి ట్రీటిస్తూ నిరంతరం హాట్ టాపిక్ గా మారుతోంది. అసలింతకీ ఎవరీ భామ? అంటే.. టైగర్ ష్రాఫ్ సోదరి జాకీష్రాప్ గారాల పట్టీ కృష్ణా ష్రాఫ్.డాడీ కూచీగా.. గారాల చెల్లెలుగా కృష్ణా ఏం చేసినా డాడ్ కానీ అన్న కానీ అస్సలు పట్టించుకోరు. తమ సపోర్ట్ ఎప్పుడూ ష్రాఫ్ గాళ్ కి ఉంటుంది. అందుకే ఈ భామ స్వేచ్ఛా విహారానికి అడ్డూ ఆపూ లేదు. దాని గురించి నిరంతరం యూత్ లో చర్చకు వస్తోంది. తనకు కాబోయే వాడు ఇబాన్ హేమ్స్ తో కృష్ణ విదేశీ విహారాల్లో ఉన్నప్పటి ఫోటోలు ఇప్పటికే వైరల్ గా మారాయి.

తాజాగా కృష్ణ ష్రాఫ్ ఇన్ స్టాలో ఓ కొత్త ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో పూల్ సైడ్ బికినీ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ. కృష్ణా ఇచ్చిన ఆ ఒక్క ఫోజు కుర్రకారుకు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. బ్లాక్ బికినీలో కృష్ణ అందాలు చూసి కృష్ణ కృష్ణ అనేస్తున్నారు కుర్రాళ్లు అయితే. ఆ నాభి కేంద్రానికి దిగువగా.. థై సౌందర్యానికి ఎలివేషన్ తెస్తున్న పచ్చబొట్ల వ్యవహారమేమిటో అంటూ యూత్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పటికి.