డ్రగ్స్ కేసు : వైష్ణవ్ మూవీ విషయంలో క్రిష్ టెన్షన్

Sun Sep 27 2020 11:30:31 GMT+0530 (IST)

Drugs case: Krish tension over Vaishnav movie

బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ సీ బీ అధికారుల ముందు విచారణకు హాజరు అయిన విషయం తెల్సిందే. డ్రగ్స్ చాట్ చేసినట్లుగా ఒప్పుకున్న రకుల్ ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదంటూ విచారణలో చెప్పిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమె నలుగురి పేర్లు చెప్పిందని వారిని విచారించిన తర్వాత రకుల్ ను మళ్లీ విచారించడం జరుగుతుందని కూడా అంటున్నారు. డ్రగ్స్ ను తన ప్లాట్ లో దాచినట్లుగా రకుల్ ఒప్పుకుందంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది. డ్రగ్స్ దాచిన కేసులో రకుల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొనడం జరిగింది. ఆమె అరెస్ట్ అయితే ఇప్పటికే ఆమె నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటా అంటూ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. రెండు మూడు వారాల పాటు షూటింగ్ లో రకుల్ పాల్గొంది. ఆ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో ఆమెకు డగ్రస్ కేసుకు సంబంధించిన సమన్లు అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. విచారణ నిమిత్తం ముంబయి వెళ్లిన రకుల్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడట. సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి వరకే పూర్తి చేసి వచ్చే ఏడాదిలో పవన్ కళ్యాణ్ తో విరూపాక్ష సినిమాను చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో రకుల్ విషయం ఆయనకు ఆందోళన కలిగిస్తుందట. రకుల్ మాత్రం ఖచ్చితంగా షూటింగ్ ను అనుకున్న సమయంలో పూర్తి చేసేలా తాను సహకరిస్తాను అంటూ రకుల్ అంటుందట. కాస్త స్పీడ్ గా ఆమె కాంబో సీన్స్ ను పూర్తి చేయాలని యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట.