బాలయ్య సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారట!

Tue Jun 25 2019 19:13:07 GMT+0530 (IST)

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ - ‘యన్.టి.ఆర్.. మహానాయకుడు’ సినిమాలతో ఢీలా పడ్డారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాల తర్వాత ఎన్నికలు రావడంతో కొంత గ్యాప్ ఇచ్చి వాటిపై దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహించిన చోట మాత్రం గెలిచారు ఈ నందమూరి హీరో. ఇక ఎన్నికల హడావిడి అయిపోవడంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒకటి స్టార్ట్ చేశారు. సీ కల్యాణ్ నిర్మాణంలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రారంభమైంది. అయితే అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి కారణం మొదట్లో అనుకున్న స్క్రిప్ట్ ను పక్కన పెట్టేయడమే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే - అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇందులో విలన్ గా చూపించాలని అనుకున్నారట. కానీ ఏపీలో ఫలితాలు రివర్స్ కావడంతో ఈ సినిమాను ఆపేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో మరో కథతో సినిమా స్టార్ట్ చేయబోతున్నారట.

 ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా - మరొకటి గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమా టైటిల్ విషయంలోనూ పలు పేర్లు తెరపైకి వచ్చాయి. దీనికి ‘క్రాంతి’ అనే టైటిల్ పెట్టబోతునట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట నిర్మాత కల్యాణ్.