Begin typing your search above and press return to search.

జోరు త‌గ్గ‌ని క్రాక్‌.. పెరుగుతున్న థియేట‌ర్స్‌!

By:  Tupaki Desk   |   24 Jan 2021 11:00 AM GMT
జోరు త‌గ్గ‌ని క్రాక్‌.. పెరుగుతున్న థియేట‌ర్స్‌!
X
మాస్ మహారాజ్ ఇన్నాళ్ల దాహం ఇప్పుడు తీరుతోంది. స‌క్సెస్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేసిన ర‌వితేజకు ‘క్రాక్‌’ రూపంలో అద్బుత‌మైన హిట్ ద‌క్కింది. త‌న హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేనితో క‌లిసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌వితేజ‌.. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ విజ‌యంతో ఇటు హీరోతోపాటు.. అటు దర్శకుడు కూడా స‌క్సెస్ ట్రాక్ ఎక్కేసిన‌ట్ట‌య్యింది.

పోలీస్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవ‌డ‌మంటేనే.. దున్నుకున్నోడికి దున్నుకున్నంత యాక్ష‌న్ అన్న‌మాట‌. ఈ ప‌వ‌ర్ ఫుల్ లైన్ తీసుకున్న గోపీచంద్‌.. ర‌వితేజ‌ను మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా చూపించాడు. త‌న కెరీర్లో పోషించిన ఖాకీ పాత్ర‌ల‌కు ధీటుగా న‌టించిన మాస్ రాజా.. వెండి తెర‌పై స‌త్తా చాటాడు. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలతో విడుదలైన ఈ మూవీ.. అన్ని సెంట‌ర్ల‌లోనూ హౌస్‌ ఫుల్ గా ర‌న్ అయ్యింది. ఈ హ‌వా ఇంకా కొన‌సాగుతుండ‌డం ఒకెత్త‌యితే.. మూడో వారం త‌ర్వాత థియేట‌ర్ల సంఖ్య పెరుగుతుండ‌డం మ‌రో ఎత్తు.

క్రాక్ మూవీకి నైజాం ఏరియాలో థియేట‌ర్లు ద‌క్క‌కుండా చేస్తున్నారంటూ డిస్ట్రిబ్యూట‌ర్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. దీంతో.. ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే.. రిలీజ్ త‌ర్వాత హిట్ టాక్ తెచ్చుకున్న క్రాక్‌.. ఇప్పుడు ప్ర‌తిచోటా సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్ తో స‌త్తా చాటుతోంది.

ఇప్పుడు థియేట‌ర్ల‌లో చిత్రాలు లేవు. కొత్త చిత్రాలు రిలీజ్ కావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. దీంతో.. అప్ప‌టి వ‌ర‌కూ బాక్సాఫీస్ ను క్రాక్ దున్నేస్తుంద‌న్న‌మాట‌. థియేట‌ర్ ర‌న్ కంప్లీట్ అయ్యే నాటికి డిస్ట్రిబ్యూట‌ర్స్ దాదాపు 30 కోట్ల షేర్ అందుకుంటార‌ని ట్రేడ్ ఎన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు. కాగా.. ఈ నెల 29 నుండి ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో క్రాక్ స్ట్రీమింగ్ కానుంది.