Begin typing your search above and press return to search.

షాకింగ్ లుక్ లో సీనియ‌ర్ లేడీ క‌మెడియ‌న్‌

By:  Tupaki Desk   |   20 May 2022 12:30 PM GMT
షాకింగ్ లుక్ లో సీనియ‌ర్ లేడీ క‌మెడియ‌న్‌
X
హాస్య న‌టిగా ఎన్నో చిత్రాల్లో న‌టించి ద‌క్షిణాదిలో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు సీనియ‌ర్ హాస్య న‌టి కోవై స‌ర‌ళ‌. త‌మిళంతో పాటు, తెలుగు చిత్రాల్లోనూ త‌నదైన మార్కు హాస్యంతో ఆక‌ట్టుకున్నారామె. 2019 లో వ‌చ్చిన `అభినేత్రి 2` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన ఆమె కొంత విరామం త‌రువాత మ‌రో విభిన్న‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆమె న‌టిస్తున్న త‌మిళ చిత్రం `సెంబి`. ఇందులో ఆమె స‌రికొత్త మేకోవ‌ర్ తో ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేని విధంగా క‌నిపించ‌బోతోంది.

విభిన్న‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ప్ర‌భు సాల్మ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శుక్ర‌వారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని ద‌ర్శ‌కుడు విడుద‌ల చేశాడు. ర‌ఫ్ లుక్ లో కోవై స‌ర‌ళ క‌నిపిస్తున్న తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురిచేస్తోంది.

ప్ర‌భు సాల్మ‌న్ ఇటీవ‌ల రానా ద‌గ్గుబాటి హీరోగా `అర‌ణ్య‌` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఐదు భాష‌ల్లోనూ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది.

హీరోగా రానాకు, ద‌ర్శ‌కుడిగా ప్ర‌భు సాల్మ‌న్ కు ఏ విష‌యంలోనూ ఈ సినిమా నేరు తీసుకురాలేక‌పోగా భారీ ప్లాప్ గా నిలిచింది. దీని త‌రువాత కొంత విరామం తీసుకున్న ప్ర‌భు సాల్మ‌న్ స‌రికొత్త క‌థ‌, నేప‌థ్యంలో `సెంబి` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో కోమ‌లి టీవి షో ఫేమ్ అశ్విన్ కుమార్ హీరోగా న‌టిస్తున్నారు. కోవై స‌ర‌ళ సీరియ‌స్ గా సాగే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

`సెంబి` ఓ బ‌స్ జ‌ర్నీ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. కొంత మంది పాసింజ‌ర్స్ కోడైకెనాల్ టు దిండిగ‌ల్ ట్రావెలింగ్ కోసం ఓ బ‌స్ లో ప్ర‌యాణం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో వారు ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు, సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

విభిన్న‌మైన రోడ్ జ‌ర్నీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న కోవై స‌ర‌ళ పాత్ర చాలా విభిన్నంగా వుంటుంద‌ని తెలుస్తోంది. ఇత‌ర పాత్ర‌ల్లో తంబి రామ‌య్య‌, చైల్డ్ ఆర్టిస్ట్ నీలా న‌టించారు.