'చిరంజీవి - పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు నాగబాబు ఎవరు?'

Mon Oct 18 2021 20:00:01 GMT+0530 (India Standard Time)

Kota Srinivasrao Comments On Nagababu

'మా' ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు పలికిన మెగా బ్రదర్ నాగబాబు.. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ అంటే కోట కు అంత జెలసీ అసూయ ఎందుకని ప్రశ్నించిన నాగబాబు.. ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ''వాడు గుడ్డలిప్పుకున్నాడు.. ముసలి కోట శ్రీనివాసరావు.. అతనికి వయసు అయిపోతోంది. చాలా కాలం నుంచి అతని అవాకులు చెవాకులు వింటూనే ఉన్నా.. అతనికి బుద్ధి జ్ఞానం.. మనిషి లక్షణాలు లేవు.. జంతు లక్షణాలు ఉన్నాయి. వాడొక యానిమల్. వాడేమి మనిషి అండీ. ఆ కోట శ్రీనివాసరావుకి ఎందుకండీ? ఎప్పుడు ఉంటాడో.. ఎప్పుడు వూడిపోతాడో తెలియదు'' అంటూ కోట పై నాగబాబు కామెంట్స్ చేశారు.చిరంజీవి తమ్ముడైన నాగబాబు తన స్థాయికి తగ్గి సీనియర్ నటుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. తెలుగు సినిమాకి గర్వకారణమైన నటుల్లో ఒకరైన కోటకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాడు వీడు అని నాగబాబు అనడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇదిలా ఉండే నాగబాబు వ్యాఖ్యలపై తాజాగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ''నటుడిగా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు.. గుమ్మడి కాయంత టాలెంట్ తో పాటుగా అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండూ ఉన్నవాడే కోట. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పక్కన లేకపోతే నాగబాబు అసలు ఏంటండి? మామూలు నటుడు. ఉత్తమ నటుడు గొప్ప నటుడు ఏమి కాదు. ఇంతకు ముందు ప్రకాశ్ రాజ్ కు క్రమశిక్షణ లేదని షూటింగ్ కు రాడని నాగబాబు ఇష్టం వచ్చినట్లు తిట్టిన సంగతి తెలియదా. నాగబాబు ఒక పొలిటీషియనా? గొప్ప యాక్టరా? అసలు ఏముంది ఆయనకు క్వాలిఫికేషన్?'' అని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.

''నేను అలాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? అందరూ గోల గోల చేసేవాళ్ళు. నాకు ప్రకాశ్ రాజ్ మీద కోపం ఏమీ లేదు. ఉన్న మాట చెప్పాను. దానికి కోట - బాబూ మోహన్ నటనలో ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా పనికిరారు అన్నారు నాగబాబు. అలా మాట్లాడటం కరెక్టా? మరి ఆయన ఎవరికి పనికొస్తారు? నువ్వే ప్రకాశ్ రాజ్ ని తిట్టావ్.. నువ్వే ప్రకాష్ రాజ్ ని వెనకేసుకు వచ్చావ్. దానికి మేం ఏమీ అనలేదు కదా'' అని కోట అన్నారు. నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం పై స్పందిస్తూ.. చేయనీయండి.. ఆయన ఉండి ఉపయోగం ఏముంది ఇలాంటి వాగుడు తప్ప'' అని వ్యాఖ్యానించారు.

చిరంజీవి ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పడం నేను వినలేదు. ఒకవేళ అదే నిజమైతే చిరంజీవి సపోర్ట్ చేశారని తమ్ముడు ఆయన పరువు తీయడం ఏంటి? అన్నయ్య ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి.. గౌరవంగా మాట్లాడాలి. అలా కాకుండా అందరినీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఎలా? ప్రకాశ్ రాజ్ ఓటమికి నాగబాబు వ్యాఖ్యలే కారణం. ఇటు వైపు విష్ణు తరపున నరేష్ ఊరికే సుత్తి వాగుడు మాట్లాడుతూ ఉంటాడు.

''ఎన్నికల ముందు నేను చిరంజీవి గారితో మాట్లాడాను. మీరు లేదా మీ వాళ్ళు ఎవరినైనా ఎన్నికల్లో నిలబెట్టండి. మేమంతా సపోర్ట్ చేస్తాం. అంతేకాని మీలాంటి గొప్పవారు ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వడం మంచిది కాదు అనిపించింది అని చిరంజీవి తో అన్నారు. దానికి ప్రకాష్ రాజ్ ఒకరోజు వచ్చి ఇలా నిలబడతాను అన్నాడు.. ఆల్ ది బెస్ట్ చెప్పాను అని చిరంజీవి అన్నారు'' అని కోట శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి సపోర్ట్ చేశారో లేదో తాను చెప్పలేనని.. ఎవరూ ఓటు వేయకపోతే 294 ఓట్లు వచ్చేవి కాదు కదా? అని అభిప్రాయ పడ్డారు. ''నాన్ తెలుగు అని ఇప్పుడు ఎవరన్నారు? 1994 నుంచి నేను మాట్లాడుతున్నాను. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో తమిళ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి పరిమితులు విధించడం పై నాలుగున్నర రోజులు హంగర్ స్ట్రెయిక్ చేశాను'' అని అన్నారు. ఏదేమైనా ఈసారి ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో నిలవడం వల్లనే ప్రస్తుతం జరుగుతున్నవన్నీ వచ్చాయని పేర్కొన్నారు.

''నాకు తెలిసినంత వరకు మోహన్ బాబు కోపిష్టి. కానీ మంచి మనిషి. ఎవరికీ హాని చేసే రకం కాదు. కాకపోతే మాట చాలా కర్కశంగా ఉంటుంది. సీనియర్ నటుణ్ని అయిన నన్ను కూడా చాలా సందర్భాల్లో ఏదొకటి అంటుంటాడు. నన్నే కాదు అందరినీ అంటుంటాడు. నేను కూడా చాలాసార్లు చెప్పా.. మనం అన్నదమ్ముల్లా ఉంటాం కాబట్టి సరిపెట్టుకుంటాం. బయట ఇలా తిడితే బాగుండదు అని మోహన్ బాబుకు చెప్పాను. మోహన్ బాబుకు నాకు ఉన్న అనుబంధాన్ని కూడా విస్మరించి నేను శ్రీకాంత్ కు ఓటేశాను. ఆయన ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? ప్రత్యర్ధులు విమర్శిస్తారని అనుకున్నప్పుడు నువ్వు అసలు ఎందుకు నిలబడ్డావ్? నువ్వు మంచివాడివి. మంచి చేస్తావని ఓటేసి గెలిపించారు. నువ్వు రిజైన్ చేస్తే వాళ్ళందరికీ సమస్య వస్తే ఎవరిని అడగాలి?'' అని సీనియర్ నటుడు అన్నారు.

''ఇండస్ట్రీలో క్యాస్ట్ అనేది ఉంది. దానికి మరో ప్రశ్నే లేదు. నేను ఒక సామాజిక వర్గాన్ని గౌరవించుకుంటాను. ఎందుకంటే నూటికి 95 శాతం కమ్మ వాళ్ళు పెట్టిన ఫుడ్ నేను 40 ఏళ్ళు తిన్నాను. మిగిలిన 5 శాతం రాజులు కానీ రెడ్డిలు కానీ.. ఇలా మిగతా వాళ్ళు పోషించారు. ఇది ఒపెన్ గా చెప్తాను'' అని కోట శ్రీనివాసరావు తెలిపారు.