నేటి కార్టూన్ సిరీస్ లపై కొరటాల పంచ్ లు

Thu Sep 23 2021 17:00:01 GMT+0530 (IST)

Koratala punches on today cartoon series

`జనతా గ్యారేజ్` కోసం కలిసి పని చేశారు ఎన్టీఆర్ - కొరటాల శివ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతకుముందే దశాబ్ధాల పాటు తారక్ తో కొరటాలకు స్నేహానుబంధం ఉంది. రచయితగా కొరటాల.. తారక్ కి ఎంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఎవరు మీలో కోలీశ్వరుడు? వేదికపై కొరటాల- రాజమౌళితో తారక్ సంభాషణలు సంథింగ్ హాట్ టాపిక్ కానున్నాయి.మాటీవీలో `మీలో ఎవరు కోటీశ్వరుడు?` తర్వాత జెమినిలో `ఎవరు మీలో కోటీశ్వరుడు` మొదలైన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజా ఎపిసోడ్ గెస్టులు కొరటాల.. రాజమౌళి హోస్ట్ తారక్ ముందు హాట్ సీట్ లో కూర్చుని ముచ్చట్లాడుతున్న దృశ్యం ఎంతో ముచ్చట గొలుపుతోంది. ఇక ఈ ముచ్చట్లలో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ చానెళ్ల గురించి చర్చ సాగింది. ``కామిక్స్ అనగానే అమరచిత్రకథ టాపిక్ వస్తుంది. మీ ఫేవరెట్ కామిక్ సిరీస్..ఏది?`` అంటూ తారక్ తన స్నేహితుడు కొరటాలను అడిగారు.

చిన్నపుడు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ చూసేవాడిని. ఇప్పటికీ అదే చూస్తాను.. కార్ట్యూన్స్ అన్నిటిలోకీ టామ్ అండ్ జెర్రీ బెస్ట్.. అని కొరటాల చెప్పారు. ``నాక్కూడా అదే చాలా ఇష్టం`` అని ఎన్టీఆర్ రిప్లయ్ గా అన్నారు. అభయ్ .. భార్గవ్ లకు టామ్ అండ్ జెర్రీ లేదు. ఏవో చూస్తున్నారు! అని తారక్ అన్నారు.

చిరంజీవి గారు చెబుతున్నారు. ఇప్పుడు కార్ట్యూన్ లు చూసి మనవరాలు వచ్చి గుద్దేసి వెళ్లారట. ఇవేమి కార్ట్యూన్స్ అని వాపోయారు చిరు.. అంటూ నేటి ట్రెండీ కార్టూన్ సిరీస్ ల గురించి కొరటాల వ్యాఖ్యానించారు. ఈ మధ్య కార్టూన్ సిరీస్ వయొలెంట్ గా మారాయి అని కొరటాల అనగానే.. నాక్కూడా అలాంటి అనుభవాలున్నాయి.. అని తారక్ అన్నారు. ఇంకా రకరకాల విషయాల్ని ముచ్చటిస్తూ ఉండగా.. తారక్ తన కుమారుల గురించి చెప్పుకొచ్చారు. ``అభయ్ ఎప్పుడూ నా పోలిక.. భార్గవ్ ప్రణతి పోలిక`` అంటూ తారక్ తాజాగా ఇఎంకే ప్రోమోలో వ్యాఖ్యానించడం కనిపిస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరుడు లో ఆ పూర్తి ఇంటర్వ్యూ సన్ నెట్ వర్క్ యాప్ లో..అందుబాటులో ఉంటుంది. తారక్ తో తదుపరి కొరటాల మరో భారీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

తారక్ తో ద్వితీయ ప్రయత్నం..

జనతా గ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చినా కొరటాల తన స్నేహితుడు తారక్ కోసం మరో క్రేజీ స్క్రిప్టును రెడీ చేసి అంతే క్రేజీగా ఉండే క్యాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ .. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం అలియా భట్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. శివ ఇటీవల ఆలియాను కలుసుకుని స్క్రిప్ట్ వినిపించారు. సినిమాలో ఆలియాకు తన పాత్ర నచ్చిందట. అయితే ఇప్పటికీ బిజీ షెడ్యూళ్లతో ఉన్నందున ఆమె ఇంకా ఈ చిత్రానికి సంతకం చేయలేదు. సంతకం చేశాకే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ .. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.