ఎన్టీఆర్ 30.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలేనా?

Tue Jun 28 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Koratala Siva back to his best with NTR30

రాజమౌళి అత్యతం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ మల్టీస్టారర్ మూవీ `RRR`. మెగా పవర్ స్టార్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఓటీటీ వేదికగా దుమ్ము దులిపేస్తూ హాలీవుడ్ స్టార్ ల ప్రశంసల్ని సొంతం చేసుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ వెర్షన్ హాలీవుడ్ స్టార్స్ తో పాటు మేకర్స్ ని సైతం అబ్బుర పరుస్తోంది. దీంతో `RRR` ఓ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలా వుంటే ఈ ఊవీతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిన రామ్ చరణ్ ఎన్టీఆర్ తమ తదుపరి చిత్రాలలో బిజీగా మారిపోయారు. ఇప్పటికే రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో భారీ మూవీని పట్టాలెక్కించేశాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది కూడా.. త్వరలోనే అమృత్ సర్ లో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళ మళయాల కన్నడ హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నామంటూ మేకర్స్ ప్రకటించారు. డైలాగ్ టీజర్ ని కూడా ఐదు భాషలలో విడుదల చేసి షాకిచ్చారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించబోతున్నారు. అయితే స్క్రిప్ట్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో మేకర్స్ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడంపై ఆలోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికి వచ్చింది. స్క్రీప్ట్ వర్క్ ని ఆల్ మోస్ట్ పూర్తి చేసిన కొరటాల ఈ మూవీపై పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్ గా వున్నారట. అయితే క్లైమాక్స్ విషయంలోనే కాస్త ఇబ్బంది పడుతున్నారని అయితే తాజాగా అది కూడా పర్ఫెక్ట్ గా వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం దర్శకుడు కొరటాల శివ భారీ స్థాయిలో కసరత్తులు చేస్తున్నారట. క్లైమాక్స్ కోసం ఇప్పటికే భారీ సెట్ ని నిర్మించడం మొదలు పెట్టారు.

ఇందులో చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం సరికొత్త మేకోవర్ ని ట్రై చేస్తున్నారట. ఇందు కోసం 8 నుంచి 9 కేజీలు బరువు కూడా తగ్గుతున్నారట. అన్నీ సవ్యంగా కుదిరితే ఫ్యాన్స్ కి పూనకాలే అని తెలుస్తోంది. జూన్ లో సెట్స్ పైకి రానుందని ప్రచారం జరిగిన ఈ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. హీరోయిన్ ఎవరన్నది మరి కొన్ని రోజుల్లోనూ మేకర్స్ ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.