Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్సెస్ పెండింగ్ ప్రాజెక్టు పెళ్లేనా?

By:  Tupaki Desk   |   24 April 2019 1:30 AM GMT
మెగా ప్రిన్సెస్ పెండింగ్ ప్రాజెక్టు పెళ్లేనా?
X
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నెక్ట్స్ స్టెప్ ఏంటి? ప‌్రస్తుతం మెగాభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఇప్ప‌టికే కెరీర్ ప‌రంగా ఆశించిన స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. న‌టించిన సినిమాల‌న్నీ నిరాశ‌పరిచాయి.ఒక్క‌ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అన్న హోప్ తో ప్ర‌య‌త్నించినా ఎందుక‌నో స‌ఫ‌లం కాలేదు. చేసిన ప్ర‌తి ఎటెంప్ట్ త‌న‌ని తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది. గ్లామ‌ర్ ప‌రంగా ఎక్క‌డా హ‌ద్దు మీర‌ని మెగా డాట‌ర్ క‌ట్టుబాట్ల‌ విష‌యంలో సాంప్ర‌దాయ బ‌ద్ధంగానే తెర‌పై క‌నిపించేందుకు ఆస‌క్తి చూపారు. న‌ట‌న‌లో కొన‌సాగినంత కాలం ప‌ద్ధ‌తిని ఏమాత్రం మీర‌న‌ని నిహారిక తెలిపారు. కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం పెద్ద తెర కెరీర్ లో ఆశించిన జోష్ మాత్రం మిస్స‌య్యింది.

యాక్టింగ్ కెరీర్ ని సీరియ‌స్ గానే తీసుకున్నారా? అని ప్ర‌శ్నిస్తే.. నేను ఏ ప‌ని చేసినా దానిని నిబ‌ద్ధ‌త‌తో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాన‌ని అన్నారు. ఇటీవ‌ల `సూర్య‌కాంతం` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో డాడ్ నాగ‌బాబు త‌న‌కు విధించిన ఓ శ‌ర‌తు గురించి నిహారిక‌ రివీల్ చేశారు. రెండు మూడేళ్లు మాత్ర‌మే న‌ట‌న‌... ఆ త‌ర్వాత మాత్రం త‌ప్ప‌నిస‌రిగా పెళ్లాడేయాల్సిందేన‌ని నాన్న‌గారు ముందే చెప్పార‌ని.. అందుకు ఒప్పుకున్నందుకే త‌న‌కు న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ని తెలిపారు. ఇప్ప‌టికే త‌నకు ఇచ్చిన గ‌డువు ముగిసింది. ఇక పెండింగ్ ప్రాజెక్ట్ పెళ్లి మాత్ర‌మే. కొంత‌కాలంగా నిహారిక సైలెంట్ గానే ఉన్నారు కాబ‌ట్టి ఇంట్లో వ‌రుడిని వెతికే ప‌నిలోనే ఉన్నారా? అన్న సందేహాలు అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజ‌మైతే శుభ‌వార్త అందుతుంద‌నే భావిస్తున్నారు.

కెరీర్ ఆరంభంతో పోలిస్తే నిహారిక లో చ‌క్క‌ని ప‌రిణ‌తి క‌నిపిస్తోంది ఇప్పుడు. అందుకే క‌థానాయిక‌గా మ‌రో ఎటెంప్ట్ చేస్తారా? లేక నాన్న‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి పెళ్లాడేస్తున్నారా? అన్న‌ది వేచి చూడాలి. పెళ్లితో ప‌ని లేకుండా ప్ర‌స్తుతానికి వెబ్ సిరీస్ నిర్మాత‌గా మాత్రం కొన‌సాగుతాన‌ని నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.