Begin typing your search above and press return to search.

తెలంగాణ రక్తచరిత్రకు ‘వర్మ’ అంకురార్పణం..

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 AM GMT
తెలంగాణ రక్తచరిత్రకు ‘వర్మ’ అంకురార్పణం..
X
తెలంగాణ రాజకీయాల్లో కొండా మురళి దంపతులంటే తెలియని వారుండరు. రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఏవిషయాన్నైనా దాచుకోకుండా కుండ బద్ధలు కొట్టినట్లు చెబుతారు. వైఎస్ హయాంలో కొండా మురళి, కొండా సురేఖలో రాజకీయంగా మంచి హోదాలో ఉన్నారు. కొండా మురళి ఎమ్మెల్సీగా పనిచేయగా.. కొండా సురేఖ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా వీరు కొన్ని పార్టీలు మారి చివరికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కొండా మురళిని మీటయ్యాడు. అంతేకాకుండా కొండా సురేఖ చదువుకున్న కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. అయితే ఇదంతా కొండా మురళి బయోపిక్ తీసేందుకేనన్న చర్చ జోరుగా సాగుతోంది.

రియల్ లైఫ్ ను రీల్ పైకి ఎక్కించడంలో ఆర్జీవికి పెట్టింది పేరు. ఆయన ఇప్పటికే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించాడు. ‘రక్త చరిత్ర’ పేరుతో రెండు భాగాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా మారాడు. ఆ తరువాత సమాజంలో జరుగుతున్న ప్రతీ సంఘటనను ఆధారంగా తీసుకొని సినిమా తీయడం రాంగోపాల్ వర్మ ప్రత్యేకత. తాజాగా ఆయన కొండా మురళి బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నారు. అయితే కొండా మురళి బయోపిక్ అని పేరు పెట్టినా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాట పటిమను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొండా మురళిని కలిసిన ఆర్జీవి తాను తీయబోయే సినిమా గురించి చెప్పగా అందుకు మురళి ఒకే చెప్పినట్లు సమాచారం.

కొండా మురళి వర్మతో 1995 నాటి పరిస్థితులు చెప్పినట్లు సమాచారం. పెత్తందార్ల పెత్తనం భరించలేక కొందరు బడుగు వర్గాలు తిరగబడిన చరిత్రను వివరించాడు. అయితే పెత్తందార్లపై తిరుగుబాటు చేసిన వారిని అణగదొక్కినా నెరవకుండా కొండా మురళి, మాజీనక్సలైట్ రామకృష్ణ నాయకత్వంలో తిరుగుబాటు చేశారని వర్మ తెలిపారు. తెలంగాణలో 1995లో జరిగిన ఓ చరిత్ర కోరలు ఇప్పటికీ రాజకీయాల్లో కరుస్తూనే ఉన్నాయన్నారు.

ఇక కొండా మురళితో ఆర్కే అలియాస్ రామకృష్ణకు ఉన్న అనుబంధం గురించి ప్పాడు. విజయవాడలో చదువుకోవడం వల్ల రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి తెలుసునని, అయితే తెలంగాణ సాయుధ పోరాటం గురించి తక్కువే తెలుసునన్నారు. అయితే అనుకోకుండా తాను పోలీసులను, మాజీ నక్సలైట్లను కలవడం వల్ల ఒక అవగాహనకు వచ్చానని తెలిపారు.

వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులు ప్రత్యేకంగా నిలిచారు. ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అనుచరుడిగా ఉన్న కొండా మురళి.. ఆ తరువాత ఆయనకే పోటీగా మారాడు. వైఎస్ హయాంలో కొండా మురళిని ప్రోత్సహించడంతో ఆయన దయాకర్ రావుకు వ్యతిరేకంగా మారాడు. ఆ తరువాత ఆయన భార్య కొండా సురేఖ ఎమ్మెల్యేగా, మంత్రి పనిచేయడంతో పాటు కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగినా వరంగల్ రాజకీయాల్లో తన పట్టును నిలుపుకున్నాడు. వైఎస్ మరణం తరువాత జగన్ కు మద్దతుగానిలిచిన వీరు ఆ తరువాత ఆయనతో విడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో జగన్ తెలంగాణకు వచ్చే సమయంలో కొండా దంపతులు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో కేసీఆర్, హరీశ్ రావుపై కొండా సురేఖ బూతులు తిట్టారు. అయితే ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ లో చేరారు. తమకు టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్లోకి చేరారు.

కొండా మురళి బయోపిక్ తీసేందుకు ఇటీవల వర్మ వరంగల్ పరిసర ప్రాంతాల్లో సీక్రెట్ గా పర్యటించారు. అయితే ఇక్కడి అడవులు, కళాశాలల్లోనూ షూటింగ్ తీసేందుకు ప్లాన్ వేస్తున్నాడు. అయితే వర్మ సినిమా అంటేనే వివాదాలకు కేరాఫ్ గా ఉంటుంది. అయితే కొండా మురళి బయోపిక్ సినిమాతో వర్మ ఎలాంటి వివాదాల్లో ఇరుక్కుంటాడోనని చర్చించుకుంటున్నారు.