ఎఫ్ 3 ని కంగారు పెడుతున్న కోనసీమ మంటలు

Wed May 25 2022 13:00:52 GMT+0530 (IST)

Konaseema tension for Upcoming Film

మరో రెండు రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్ ఎఫ్ 3 విడుదల కాబోతుంది. వెంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాను అనీల్ రావిపూడి తెరకెక్కించాడు. తమన్నా.. మెహ్రీన్.. సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా నటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఎఫ్ 2 సక్సెస్ నేపథ్యంలో ఎఫ్ 3 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దాంతో అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అయ్యింది.కొన్ని ఏరియాల్లో స్వయంగా దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా విడుదల రెండు రోజులు ఉండగా ఏపీలో కోనసీమ ప్రాంతంలో అల్లర్లు జరగడం.. 144 సెక్షన్ విధించడంతో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏపీలో కోనసీమ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నా కూడా మొత్తం ఆంద్రా ప్రాంతం అంతా కూడా ఒకింత ఉత్కంఠభరిత వాతావరణంలో కనిపిస్తుంది.

గోదావరి జిల్లాల్లో ఎక్కడికి అక్కడ పరిస్థితులు చాలా సీరియస్ గా గంభీర్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎఫ్ 3 సినిమా విడుదల అయితే పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమాకు మహారాజా పోషకులు గోదావరి జిల్లాల వారు అనడంలో సందేహం లేదు. అలాంటి గోదావరి జిల్లాల్లో పరిస్థితి సరిగా లేనప్పుడు ఎఫ్ 3ని విడుదల చేస్తే ఖచ్చితంగా వసూళ్ల పై ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా కోనసీమలో 144 సెక్షన్ కారణంగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. అవి ఎప్పటికి ఓపెన్ అయ్యేది క్లారిటీ లేదు. దాంతో అక్కడి బయ్యర్లు మరియు ఎగ్జిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక నిర్మాత దిల్ రాజు ఆలోచనలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు వారాలుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విడుదలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

ఈ సమయంలో సినిమాను వాయిదా వేయడం అనేది దాదాపుగా అసాధ్యం. ఒక వేళ ఇప్పుడు సినిమాను వాయిదా వేసినా కూడా మళ్లీ విడుదల చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు డేట్లు అన్నీ కూడా ఫుల్ అయ్యాయి. కనుక ఏ పరిస్థితులు ఉన్నా కూడా నష్టపోయినా కూడా ఎఫ్ 3 ని అనుకున్నట్లుగానే మరో రెండు రోజుల్లో విడుదల చేయడం ఖాయంగా తెలుస్తోంది.