డౌట్ లేదు మార్చి 5th సందీప్ కిషన్ దే: కోన వెంకట్

Mon Mar 01 2021 09:00:01 GMT+0530 (IST)

Kona Venkat Speech At A1 Express Pre Release Event

మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కథాకథనాలు నచ్చితే నిర్మాతగా కూడా సందీప్ కిషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'A1 ఎక్స్ ప్రెస్' చేశాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది.విశ్వప్రసాద్ .. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించగా సందీప్ కిషన్ మరో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. ఈ సినిమాతో డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో రామ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ముందుగా ఈ సినిమాను గురించి కోన వెంకట్ మాట్లాడుతూ .. "ఓ మూడు నెలలుగా నేను సందీప్ ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నాము. ఈ సినిమా ట్రైలర్ చూశాను .. ప్రతి ఫ్రేమ్ లోను సందీప్ ఎనర్జీ కనిపించింది. డౌట్ లేదు మార్చి 5th ఆయనదే. ఈ సినిమా తప్పకుండా హ్యూజ్ హిట్ కొడుతుంది.

కోవిడ్ తరువాత ప్రతి సినిమాను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఆడియన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిపాప్ తమిళ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నాను. అలాగే దర్శకుడు 'డెన్నీస్ జీవన్ కనుకొలను' పేరు చూసినప్పుడు ఈ సినిమాకు ముగ్గురు దర్శకులేమోనని అనుకున్నాను అంటూ చమత్కరించాడు. తొలి ప్రయత్నంలో ఆయన సక్సెస్ ను సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ టీమ్ కి శుభాకాంక్షలు అందజేశాడు.