Begin typing your search above and press return to search.

వైఎస్ఆర్ పంచ్ కు కోన వెంకట్ ఔట్

By:  Tupaki Desk   |   8 July 2020 2:00 PM GMT
వైఎస్ఆర్ పంచ్ కు కోన వెంకట్ ఔట్
X
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఏపీలో పండుగలా ప్రభుత్వం నిర్వహిస్తోంది. సీఎం జగన్ సహా వైసీపీ శ్రేణులంతా వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయిత కోనవెంకట్ కూడా వైఎస్ఆర్ తో తనకున్న తీపి జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. ఓ సారి చెన్నై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తుండగా అదే విమానంలో వైఎస్ఆర్ ఉన్నారట.. కోన వెంకట్ ను గుర్తు పట్టి పిలిచి ‘ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోందని.. సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నావని ఓ సారి మా ఇంటికి వచ్చి మా మేనల్లుడితో మాట్లాడు’ అని వైఎస్ఆర్ అన్నాడట.. దీనికి కోన వెంకట్ ఎందుకని ప్రశ్నించగా.. మా మేనల్లుడు సినిమాలంటూ కెరీర్ వేస్ట్ చేసుకుంటున్నాడని.. వాడికి కాస్త బుద్ది చెప్పు అని అన్నాడట..

ఇంటికి పిలిస్తే కథలు వినడానికో.. లేదా సినిమా ఆఫర్ ఇస్తారనే అనుకున్నానని.. కానీ సినిమాల్లోకి వద్దు అని చెప్పడానికి రమ్మన్నారని తెలిసి తాను షాక్ అయ్యానని కోనవెంకట్ గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన ఆ షాక్ నుంచి తాను కోలేకోలేదని కోనవెంకట్ చెప్పుకొచ్చాడు.