Begin typing your search above and press return to search.

తెలుగు హీరోలపై కోన స్పెషల్ కామెంట్

By:  Tupaki Desk   |   3 Dec 2015 3:05 PM GMT
తెలుగు హీరోలపై కోన స్పెషల్ కామెంట్
X
టాలీవుడ్ హీరోలపై తనదైన శైలిలో కామెంట్ల చేశాడు స్టార్ రైటర్ కోన వెంకట్. మన హీరోల్లో ఒక్కొక్కరి గురించి ఒక్కో మాటలో చెప్పమంటే తన రైటింగ్ టాలెంట్ చూపిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. మరి కోన మాటల్లో మన హీరోలేంటో చూడండి.

పవన్ కళ్యాణ్- నిజాయితీకి నిలువుటద్దం

మహేష్ బాబు- రాజసానికి నిర్వచనంలా ఉంటాడు

బాలకృష్ణ- అద్దం లాంటి వాడు. స్వచ్ఛమైన మనసున్నవాడు, చాలా ముక్కుసూటిగా ఉంటాడు.

నాగార్జున- కూల్ మైండెడ్ పర్సన్

వెంకటేష్- వార్మ్ హార్టెడ్ పర్సన్

మోహన్ బాబు- తన కోసం పని చేసే వాళ్లను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటాడు.

ఎన్టీఆర్- స్నేహానికి అర్థం

రామ్ చరణ్- తన బృందంలోని సభ్యుల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు.

రవితేజ- ఎంతో సంతోషాన్నిస్తాడు

రామ్- సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎనర్జీ ఇస్తాడు

గోపీచంద్- ఎవ్వరైనా ఇష్టపడే వ్యక్తి

అఖిల్- లైఫ్ టైం ఫ్రెండ్

నిఖిల్- భిన్నమైన స్క్రిప్టులు రాసే వారికి మంచి ఆప్షన్