ఈవీఎంకు కొత్త అర్థాన్ని చెప్పిన వెంకట్

Tue May 15 2018 14:02:53 GMT+0530 (IST)

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పలు రంగాలకు చెందిన ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. కన్నడ పీఠాన్ని చేజిక్కించుకున్న బీజేపీని పలువురు అభినందిస్తుంటే.. మరికొందరు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈవీఎంకు కొత్త తరహా అర్థాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యంగ్య వ్యాఖ్యలు పెడుతున్నారు.ఈవీఎం అంటే.. ఎవ్రీ ఓట్ మోడీ.. మోడీకు ప్రతి ఓటు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

అందరి అంచనాలకుభిన్నంగా వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సినీ రంగ ప్రముఖుడు కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కౌంటింగ్ స్టార్ట్ చేసింది మొదలు.. రిజల్ట్ ప్రతి ఒక్కటీ మోడీకే అన్నట్లుగా వచ్చినట్లుగా కోన వెంకట్ వ్యాఖ్యానించారు.

ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)ను ఓపెన్ చేశారో.. అప్పుడే రిజల్ట్ ఈవీఎం అని పేర్కొన్నారు. ఈవీఎం అంటే మరేమిటో కాదు.. ఎవ్రీ ఓట్ మోడీ అని. చేయాల్సిన కామెంట్ చేస్తూనే.. నో కామెంట్ అంటూ తెలివిగా వ్యాఖ్యానించారు.