Begin typing your search above and press return to search.

తెరపైకి తెలుగు క్రీడా తేజం బయోపిక్..

By:  Tupaki Desk   |   1 Jun 2020 5:30 AM GMT
తెరపైకి తెలుగు క్రీడా తేజం బయోపిక్..
X
గత కొన్నేళ్లుగా ఇండియన్ ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌లు రూపొంది మంచి హిట్లు అందుకుంటున్నాయి. బయోపిక్ లలో క్రీడా నేపథ్యంలో చాలా సినిమాలు రూపొందాయి. ఈ బయోపిక్లు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అందులో క్రికెటర్స్ ‘అజారుద్దున్’, ‘ఎంఎస్ ధోని’, ‘సచిన్’ సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం దేశానికి క్రికెట్‌లోవరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా.. రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘83’ సినిమా బయోపిక్ రాబోతుంది. కరోనా లాక్‌డౌన్ లేకపోతే.. ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. అంతేగాక వెండితెరపై మహిళ ప్రపంచ క్రికెట్‌లో సత్తా చాటి మిథాలీ రాజ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటి తాప్సీ మిథాలీ రాజ్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ’శభాష్ మిథు’ అనే టైటిల్ ఖరారు చేసింది. తాజాగా ఒలింపిక్స్‌లో మన దేశానికి వ్యక్తిగతంగా తొలి పతకం అందించిన కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కించబోతుట్లు అధికారికంగా ప్రకటించారు కోన వెంకట్.

జూన్ 1.. అంటే ఈరోజు క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎంవివి. స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. మల్లీశ్వరి గారు శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లె నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం గెలిచే వరకు బయోపిక్‌ లో చూపించనున్నారట. ప్రముఖ క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్నతో పాటు ఆమె పద్మశ్రీనీ అందుకున్నారు. అయితే ఈ చిత్రంలో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.