'కోలు కోలమ్మా కోలో' అంటూ ఆడిపాడుతున్న సాయి పల్లవి.

Tue Feb 23 2021 19:05:03 GMT+0530 (IST)

Kolu Kolu Song Promo From Virata Parvam

''కోలు కోలమ్మా కోలో.. కోలో నా సామి.. మనసే మేలుకొని చూసే.. కలలో నిండిన వాడే కనుల ముందుర ఉంటే నూరేళ్లు నిదుర రాదులే" అంటూ ప్రేమించిన వాడి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఓ అమ్మాయి పాడుకుంటోంది. ఆ అమ్మాయి సాయి పల్లవి ఆయితే.. ఆమె ప్రేమించిన అబ్బాయి దగ్గుబాటి రానా. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ''విరాటపర్వం'' - 'రివల్యూషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ లవ్' సినిమాలోనిదీ ఈ గీతం. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల జరుపుతున్న చిత్ర యూనిట్.. తాజాగా ఫస్ట్ సింగిల్ 'కోలు కోలు' ప్రోమోని విడుదల చేసింది.'కోలు కోలు' పాటకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. లిరిసిస్ట్ చంద్రబోస్ వినసొంపైన సాహిత్యం అందించగా.. సింగర్ దివ్య మాలిక - సురేష్ బొబ్బిలి కలసి ఆలపించారు. ఇక ఈ సాంగ్ లో లంగావోణీ ధరించి సాయి పల్లవి వేసిన క్యూట్ స్టెప్స్ అలరిస్తున్నాయి. ఈ సాంగ్ పిక్చరైజేషన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న 'విరాటపర్వం' చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. ప్రియమణి - నివేథా పేతురాజ్ - నందితా దాస్ - నవీన్ చంద్ర - ఈశ్వరీరావు - జరీనా వహాబ్ - సాయిచంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.