'బాహుబలి'పై కన్నేసిన విజయ్

Tue Jan 24 2023 10:02:07 GMT+0530 (India Standard Time)

Kollywood super star vijay thalapathy movie news

దలపతి విజయ్ ఇటీవలే వారసుడు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తమిళంలో వారీసు పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ... తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేశారు. దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన దిల్ రాజుకు మాత్రం కాస్త నష్టాలు తెచ్చి పెట్టే విధంగానే ఉందని అంటున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా తరువాత తలపతి విజయ్ తన 67వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే నిజంగానే దర్శకత్వంలో తెరకెక్కుతుందా లేదా అనే విషయం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో  గౌతమ్ మీనన్ తో కూడా ఆయన ఒక సినిమా చేస్తున్నట్లుగా ప్రచారం తెర మీదకు రావడంతో ఈ సినిమాల విషయం మీద అనేక అనుమానాలు అయితే ఉన్నాయి.

ఇక తాజాగా విజయ్ తన 68 సినిమా గురించి మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అదేమిటి అంటే ఇప్పటివరకు దర్శకులు నిర్మాతలు ఎలాంటి సినిమాలు తెచ్చిన అలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన విజయ్... ఈసారి బాహుబలి కే జి ఎఫ్ రేంజ్ లో ఒక సినిమా ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు ఆడుతున్న నేపథ్యంలో తన మార్కెట్ను కూడా పెంచుకునే పనిలో విజయ్ పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బడా దర్శకులకు ఆయన టచ్ లోకి వెళ్ళారని తనకోసం బాహుబలి లేదా కేజిఎఫ్ లాంటి కథలను సిద్ధం చేయమని ఆయన కోరారు అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది.

 నిజానికి కేజిఎఫ్ బాహుబలి లాంటి సినిమాలు తీయాలని ఇప్పటికే చాలామంది దర్శకులు ప్రయత్నించారు. అందులో దాదాపుగా అందరూ విఫలమవుతూనే వచ్చారు. పోన్నియన్ సెల్వన్ సినిమా మాత్రం కొంతమేర తమిళంలో వర్కౌట్ చేసుకోగలిగింది. కానీ ఇతర భాషల్లో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే మరి విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయి అనేది వేచి చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.