Begin typing your search above and press return to search.

అజిత్ కుమార్.. పవర్ఫుల్ లైనప్!

By:  Tupaki Desk   |   29 Jan 2023 12:00 PM GMT
అజిత్ కుమార్.. పవర్ఫుల్ లైనప్!
X
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్టైనర్ కథలతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా వినోత్ దర్శకత్వంలో తునివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ పరంగా భారీగానే అర్జించింది. లాభాలతో బయటపడింది. తమిళంలో బ్రేక్ ఎవెన్ ని దాటిపోయి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ కి చెందిన స్టార్ నటులని ఎంపిక చేయబోతున్నారు. అలాగే ఐశ్వర్య రాయ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ ఉండగా నయనతార హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సాయి పల్లవి ఈ మూవీలో మరో కీలక పాత్రలో నటించబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అజిత్ కుమార్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తి నెలకొని ఉంది.

అజిత్ కుమార్ లైనప్ లో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వారిలో ఒకరు విష్ణువర్ధన్. అజిత్ తో బిల్లా సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడిగా విష్ణువర్ధన్ ని మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో ఆయన శైలి వేరు. ఇక అతని తర్వాత యాక్షన్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన శివ ఉన్నారు. శివ, అజిత్ కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం శివ సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.

ఇది పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. వీరిద్దరితో పాటు కమర్షియల్ స్టార్ దర్శకుడు అత్లీ కూడా ఉన్నారు. షారుక్ తో అత్లీ జవాన్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉంది. ఈ నేపధ్యంలో అత్లీ ఇప్పటికే అజిత్ కి ఒక స్టొరీ చెప్పి ఫైనల్ చేసుకున్నాడు అనే టాక్ ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరితో ముందుగా సినిమాని అజిత్ స్టార్ట్ చేస్తాడు అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.