Begin typing your search above and press return to search.

ప్రేక్షకుల వద్దకే కోలీవుడ్ సినిమాలు..!

By:  Tupaki Desk   |   23 Feb 2021 7:32 AM GMT
ప్రేక్షకుల వద్దకే కోలీవుడ్ సినిమాలు..!
X
సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా సినీప్రేక్షకులు ఇంకా డిజిటల్ ప్లాట్ ఫామ్ లనే ఇష్టపడుతున్నారు. అంటే లాక్డౌన్ సమయంలో ఓటిటిలు జనాలపై ఎంతటి ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోవచ్చు. కొత్త సినిమాల దగ్గర నుండి ప్రోగ్రాంస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇలా అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో జనాలు ఓటిటిలకు అలవాటు పడ్డారు. ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓటిటి స్ట్రీమింగ్ వైపు జనాలు మళ్లడం కాదు. ఏకంగా సినీతారలే ఓటిటి వైపు మొగ్గుచూపడం గమనార్హం. ఇప్పటికే థియేటర్స్ తెరుచుకున్నాక కూడా భారీ సినిమాలు ఓటిటిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. అందులో తమిళ హీరో జయంరవి నటించిన భూమి సినిమా ఓటిటిలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే నయనతార నటించిన 'ముకూతి అమ్మన్' కూడా డిజిటల్ స్ట్రీమ్ అయింది.

అయితే ఇదంతా సినిమా థియేటర్స్ ప్రాబ్లెమ్ అవుతాయనే ఉద్దేశంతో ఓటిటి బాటపట్టినట్లు టాక్. కానీ ఇప్పుడు చిన్నహీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు థియేటర్స్ ఓపెన్ అయ్యాక కూడా డిజిటల్ స్ట్రీమింగ్ వైపు ఇంటరెస్ట్ చూపుతున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ గోలంతా తమిళ ఇండస్ట్రీలోనే సాగుతుంది. ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలు ఓటిటిలో ప్రదర్శితం కాబోతున్నాయి. అందులో హీరో ఆర్య, తన భార్య సయేషా సైగల్ జంటగా నటించిన టెడ్డి సినిమా డిస్నీ హాట్ స్టార్ లో మార్చ్ 12న స్ట్రీమ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే యాక్టర్ సముద్రఖని ప్రధానపాత్రలో నటించిన 'ఏలే' మూవీని డైరెక్ట్ విజయ్ టీవీలో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే గనక ముందుముందు చాలా సినిమాలు ఇదే బాటపట్టే అవకాశం ఉంది. ఇక ధనుష్ నటించిన 'జగమే తంత్రం' కూడా డిజిటల్ స్ట్రీమ్ కానుందట. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుందని సమాచారం. చూడాలి మరి థియేటర్ల వద్దకు ప్రేక్షకులు వస్తున్నా.. ప్రేక్షకుల వద్దకు సినిమాలు రావడం ఎంతవరకు సక్సెస్ అవుతుందో!