బిచ్చగాడి హత్యలు - ట్రైలర్ టాక్

Thu Apr 25 2019 15:03:38 GMT+0530 (IST)

Kolaigaran Official Trailer

తెలుగునాట బిచ్చగాడితో ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ  కొత్త సినిమా కొలైగారన్ (తెలుగు 'కిల్లర్' ) విడుదలకు రెడీ అవుతోంది. దీని ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ ని ట్రై చేసే విజయ్ అంటోనీ ఇందులో కూడా ఏదో కొత్తగానే ట్రై చేశాడు. కథ విషయానికి వస్తే పోలీసులు వెతుకుతున్న ప్రభాకరన్(విజయ్ అంటోనీ) స్వయంగా స్టేషన్ కు వచ్చి లొంగిపోతాడు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్(అర్జున్)కు ఇందులో ఏదో మతలబు కనిపిస్తుంది. సాయం కోసం తన సీనియర్(నాజర్)సలహాలు తీసుకుంటాడు.విచారిస్తే ప్రభాకరన్ హత్యలు చేస్తోంది అతను వన్ సైడ్ లవ్ చేసిన ధరణి(అషిమా నర్వాల్)కోసమని తేలుతుంది. అంతేకాదు తాను చేసింది ఒక హత్య కాదని ఇంకో షాక్ ఇస్తాడు ప్రభాకరన్. అసలు నిజంగా ధరణి అనే అమ్మాయి ఉందా ప్రభాకరన్ ఇదంతా ఎందుకు చేసాడు ఛాలెంజ్ గా తీసుకున్న ఆఫీసర్ దీన్ని ఎలా చేధించాడు అనేదే మిగలిన కథ

ట్రైలర్ లో చూసినదాన్ని బట్టి కథ మొత్తం ఎక్కువగా విజయ్ అంటోనీ అర్జున్ పాత్రల చుట్టే కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో తీసుకున్నారు కాబట్టి థ్రిల్స్ బాగానే పొందుపరిచినట్టు అనిపిస్తోంది. మీసాలు బాగా మెలిపెట్టి క్షత్రియ పుత్రుడు స్టైల్ లో అర్జున్ లుక్స్ బాగున్నాయి. అతనే పెద్ద అసెట్ లా కనిపిస్తున్నాడు. విజయ్ అంటోనీ ఎప్పటిలాగే తనదైన బాణిలో చేసుకుంటూ పోయాడు. ఈ ఇద్దరు కాకుండా నాజర్ తప్ప ఇంకే చెప్పుకోదగ్గ ఆర్టిస్టు కనిపించలేదు. ఆండ్రీ లూయిస్ దర్శకత్వం వహించిన కిల్లర్ కు సైమన్ కింగ్ సంగీతం అందించారు. మ్యుక్స్ ఛాయాగ్రహణం స్టాండర్డ్ లో ఉంది. మొత్తానికి బిచ్చగాడి నేపధ్యానికి పూర్తి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న విజయ్ అంటోనీ చాలా కాలంగా దూరమైన సక్సెస్ ని దీంతో అయినా కొడతాడో లేదో చూడాలి