Begin typing your search above and press return to search.

`కాఫీ విత్ కరణ్`లో కరీనా మాజీ భర్తగా పిలుస్తాడు

By:  Tupaki Desk   |   6 Aug 2022 2:30 AM GMT
`కాఫీ విత్ కరణ్`లో కరీనా మాజీ భర్తగా పిలుస్తాడు
X
ఇప్ప‌టికే అత‌డు గీత‌ దాటాడు. క‌థానాయిక‌ల గుట్టు మ‌ట్లు బ‌య‌ట‌పెడ్డ‌డంలో హ‌ద్దులు చెరిపేశాడు. అంతేనా.. అగ్ర హీరోలు సీనియ‌ర్ క‌థానాయిక‌లు అనే తేడా లేకుండా ఎక్స్ ట్రా మ్యారిట‌ల్ లైఫ్ గురించి కూడా ప్ర‌శ్నించేస్తున్నాడు. మాజీ బోయ్ ఫ్రెండ్ తో శృంగారం చేస్తావా? లాంటి ప్ర‌శ్న‌లు కూడా అడిగేశాడు. అందుకే ఆ షో అంత బంప‌ర్ హిట్టు. తార‌ల గుట్టు మ‌ట్లు అన్నీ బ‌య‌ట‌కు లాగే ఏకైక షోగా కాఫీ విత్ క‌ర‌ణ్ పాపుల‌రైంది.

ఓటీటీలో సీజ‌న్ 7 మ‌రింత బంపర్ హిట్ కొట్టింది. వ‌రుస ఎపిసోడ్ల‌తో హోస్ట్ కేజేవో మోతెక్కిస్తున్నాడు. న్యూడ్ ఆడ్ అడ‌ల్ట్ కంటెంట్ అంటూ సాంప్ర‌దాయ‌వాదులు ఛీత్క‌రించుకున్నా అత‌డు త‌న బాణీని మార్చ‌లేదు.. స‌రిక‌దా ఇంకా ఎక్కువ అడ‌ల్ట్ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.

అయితే అత‌డు అడిగిన మోటు ప్ర‌శ్న‌ల్లో ఏది అత్యుత్త‌మ ప్ర‌శ్న అంటే తాజాగా ఒక ఎగ్జాంపుల్ ప్ర‌త్యేకంగా చేతికి చిక్కింది. ఇటీవలి ఎపిసోడ్ లో KJo ఇద్ద‌రు పిల్ల‌ల మమ్మీ కరీనా కపూర్ ఖాన్ ను ఒక మోటైన‌ ప్రశ్న అడిగాడు. అది ఎపిసోడ్ కి చివరి కట్ లో ఝ‌ల‌క్ మ‌నిపించింది. ``బెబో మీరు ఈ షోలో చాలా సార్లు క‌నిపించారు. మీరు మీ జీవితంలోని వివిధ దశలలో వచ్చారు.

తన భర్త .. మాజీ భర్తతోను కలిసి వ‌చ్చింది…`` అంటూ మిగిలిన వాక్యాన్ని చెప్పేలోపు కరణ్ తనంతట తానుగా ఆగిపోయాడు. హోస్ట్ మాట‌ల‌కు క‌రీనా షాక్ అయినట్లు కనిపించడంతో ప‌క్క‌నే ఉన్న అమీర్ సైతం క‌ళ్లు విప్పార్చ‌గా..` టంగ్ స్లిప్` ఎపిసోడ్ ర‌క్తి క‌ట్టించింది.

అయితే అత‌డి ప్ర‌శ్న‌లోనే భ‌ర్త అన‌గా సైఫ్ అలీఖాన్.. మాజీ భ‌ర్త అన‌గా షాహిద్ క‌పూర్ అని అర్థమైపోయింది. బెబో క‌రీనా చాలా కాలం పాటు షాహిద్ క‌పూర్ తో రిలేష‌న్ షిప్ లో ఉంది. కానీ ఆ త‌ర్వాత ఆ బంధం బ్రేక్ అయ్యింది. అటుపైనే అప్ప‌టికే విడాకులు తీసుకున్న‌ సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడింది.. అద‌న్న‌మాట‌!!

`కాఫీ విత్ కరణ్ సీజన్ 7`లో రణ్ వీర్ సింగ్-ఆలియా భట్- సారా అలీ ఖాన్-జాన్వీ కపూర్- అనన్య పాండే-విజయ్ దేవరకొండ - సమంతా రూత్ ప్రభు-అక్షయ్ కుమార్ సహా పలువురు తారలు పాల్గొన్నారు. కత్రినా కైఫ్ తో ఎపిసోడ్ కూడా స్పెష‌ల్ గా డిజైన్ చేశార‌ని ప్రోమో వెల్ల‌డించింది. `ఫోన్ భూత్` మూవీ సహనటులు ఇషాన్ ఖత్త‌ర్ - సిద్ధాంత్ చతుర్వేదిలతో క‌త్రిన ఈ షోలో కనిపిస్తారు.