పొరపాటు జరిగింది... ఆమె కాదు ఈమె విజేత అంటూ ప్రకటన

Fri Sep 30 2022 11:11:11 GMT+0530 (India Standard Time)

Koffe With Karan Mistake By Karan Johar

బాలీవుడ్ నిర్మాత కమ్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ తన కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో భాగంగా ఇటీవల ఒక ఎపిసోడ్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్ లతో చిట్ చాట్ చేసిన విషయం తెల్సిందే. ఈ ముద్దుగుమ్మలు వచ్చిన ఎపిసోడ్ కి మంచి ఆధరణ దక్కింది. అందమైన ఈ ముద్దుగుమ్మలు చెప్పిన ముచ్చట్లు.. ప్రేమ విషయాలు ఇలా కూడా వైరల్ అయ్యాయి.షో లో ఈ ముద్దుగుమ్మలకు కరణ్ జోహార్ రాపిడ్ ఫైర్ రౌండ్ ను నిర్వహించాడు. ఆ రౌండ్ లో విజేతలుగా నిలిచిన వారికి కరణ్ జోహార్ ఎపిసోడ్ ముగింపు సమయంలో ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాడు. షో చూసిన ఎవరికైనా కూడా రాపిడ్ ఫైర్ రౌండ్ లో సారా అలీ ఖాన్ గెలిచిందని అర్థం అవుతుంది.. కానీ చివర్లో మాత్రం రాపిడ్ ఫైర్ రౌండ్ లో జాన్వీ గెలిచింది అంటూ ప్రకటించి ఆమెకు గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరిగింది.

దాంతో కరణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాపిడ్ ఫైర్ రౌండ్ లో క్లీయర్ కట్ విజేత సారా అలీ ఖాన్. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయినా కూడా మీరు ఎలా జాన్వీ కపూర్ ని విజేతగా పేర్కొంటారు అంటూ విమర్శలు మొదలు అయ్యాయి.

జాన్వీ పట్ల మీరు సానూభూతి.. పక్షపాత వైఖరి చూపించారంటూ విమర్శలు చేస్తున్నారు.

ఎట్టకేలకు ఈ విషయమై కరణ జోహార్ స్పందించాడు. ఆ రాపిడ్ పైర్ రౌండ్ లో గెలిచింది సారా అలీ ఖాన్ అని.. మా టీమ్ మెంబర్స్ తప్పుడు లెక్కలు మరియు సాంకేతిక సమస్యల కారణంగా ఆ సమయంలో జాన్వీ కపూర్ ను విజేతగా ప్రకటించాల్సి వచ్చింది అంటూ కరణ్ పేర్కొన్నాడు.

ఆ రౌండ్ లో డౌట్ లేకుండా సారా అలీ ఖాన్ విజేత అన్నట్లుగా ఆయన ప్రకటించాడు. దీంతో విమర్శలకు.. వివాదాలకు సారా అభిమానులు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.