స్టార్ హీరో చెల్లెలిని ఇలా చూస్తే కంటికి కునుకు కరువే సుమీ!

Sat Jul 24 2021 08:00:01 GMT+0530 (IST)

Kishu Shroff Latest Photo

అవును.. స్టార్ హీరో చెల్లెలి సాహసాల గురించి రెబలిజం గురించి ఇప్పుడే చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే ఎన్నో ఫోటోషూట్లతో ఇంటర్నెట్ లో అగ్గి రాజేసిన సదరు స్టార్ హీరో సోదరీమణి ఇప్పుడు ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజులు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఎవరా బ్యూటీ? అంటే.. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి.. ది గ్రేట్ జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్...!కృష్ణ ష్రాఫ్ ఒక పత్రిక ముఖచిత్రం కోసం బ్లాక్ లెదర్ డ్రెస్ లో తళుక్కుమంది. బ్లాక్ లెదర్ ఫ్యాంట్ చిక్ ఒపెరా చేతి తొడుగులను ధరించిన కృష్ణా ష్రాఫ్ టాప్ లెస్ భంగిమతో దుమ్ము రేపింది.

తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కవర్ షూట్ నుంచి ఫోటోను పంచుకుంటూ కృష్ణ ష్రాఫ్ TRAILBLAZIN అన్న వ్యాఖ్యను జోడించారు. ఇలా పోస్ట్ చేయగానే చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఆమె సోదరుడు టైగర్ ష్రాఫ్ పుకార్ గర్ల్ ఫ్రెండ్ దిషా పటాని ``ఆ బాడీ పిచ్చి లేపింది! అంటూ వ్యాఖ్యానించారు. ఎల్లీ అవ్రమ్ OMG !!!! సంవత్సరం కవర్.. అంటూ స్పందించగా.. అతియా శెట్టి.. దీప్షికా నాగ్‌పాల్ ఫైర్ ఎమోజీలను వదలారు. సిద్ధంత్ కపూర్ హార్ట్ ఈమోజీని షేర్ చేశారు. ఈ ఫోటోషూట్ అభిమానుల నుండి ప్రశంసలను పొందింది. 'సంపూర్ణ అగ్గి బరాట' అని పొగిడేశారు.

కృష్ణ మాత్రం జాకీ -టైగర్ మాదిరిగా నటనను కొనసాగించడానికి ఇష్టపడదు. తన సోదరుడు 2019 లో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ జిమ్ ల చైన్ ను ప్రారంభించగా వాటి నిర్వహణను కృష్ణ చూస్తున్నారు. ఆమె ఇటీవలే కిన్ని కిన్ని వారీతో కలిసి తన మ్యూజిక్ వీడియోను ప్రారంభించింది.
కృష్ణ తన కుటుంబ సభ్యుల గురించి మరియు వారి విజయాల గురించి గర్వపడుతున్నానని కానీ తాను 'ఆ జీవితాన్ని ఎంచుకోలేదు' అని అన్నారు. 'నిరంతరం (తీర్పు) ఇవ్వడం లేదా (మాట్లాడటం) మాట్లాడటం' కష్టం'అని ఆమె అన్నారు.

ఫిట్ నెస్ లో తనకంటూ ఒక పాపులారిటీ తెచ్చుకున్న కృష్ణ ఇది తనకు వ్యక్తిత్వ భావాన్ని ఇస్తుందని అన్నారు. “నేను వచ్చిన కుటుంబం వల్ల ఆ గుర్తింపు నుండి తప్పించుకోవడం .. ఆ నీడ నుండి బయటపడటం మన కోసం ఏదైనా సృష్టించడం చాలా కష్టం. నా సోదరుడు అద్భుతమైన సూచన చేసాడు. ఫిట్నెస్ నాకు ఆ గుర్తింపు లేదా వ్యక్తిత్వాన్ని కొద్దిగా ఇచ్చింది. నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను`` అని ఆమె అన్నారు.

బికినీల్లోనూ స్పెషలిస్ట్:

ఈ భామ నిరంతరం ఇన్ స్టా మాధ్యమంలో అభిమానుల కోసం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ ని షేర్ చేసేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఇంతకుముందు తన మాజీ బోయ్ ఫ్రెండ్ తో ఘాటైన రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని కృష్ణా ష్రాఫ్ షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇటీవల వేసవి వడగాల్పుల్లో తాకిన పిల్లగాలిలా యూత్ కి సేదదీరేందుకు ఇది ఉద్ధీపన ప్యాకేజీ అంటూ ఓ బికినీ ఫోటోని షేర్ చేయగా దుమారం రేపింది. కృష్ణ ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ కథానాయికలకు ధీటుగా అందాల్ని ఆరబోతలో దుమారమే అంటూ యూత్ ఫిదా అయిపోయారు. పూల్ సైడ్ కృష్ణా ష్రాఫ్ ట్రీట్ కి కృష్ణ కృష్ణ అంటూ షాక్ తినాల్సిందే మరి.