మీ ప్రమోషన్ బాగుంది బాయ్స్.. మాస్క్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది

Tue Aug 03 2021 23:00:02 GMT+0530 (IST)

SR Kalyana Mandapam Promotion?s

కిరణ్ అబ్బవరం హీరోగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా రూపొందిన సినిమా ఎస్ ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరో కిరణ్ అబ్బవరం కథను అందించాడు. ఒక హీరో అది కూడా యంగ్ హీరో స్టోరీ రాయడం చాలా అరుదుగా జరిగే విషయం. కిరణ్ రాసిన కథ అవ్వడం తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ట్రైలర్ కలుగ జేస్తోంది.ఈమద్య కాలంలో వినూత్నంగా విభిన్నంగా ప్రచారం చేస్తేనే థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి. సినిమా థియేటర్లు మూత పడి మూడు నెలలు అయ్యింది. గత వారం థియేటర్లలో బొమ్మ పడింది. గత వారం వచ్చిన సినిమాలు పెద్దగా వసూళ్లు దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి. కాని ఈ సినిమా యూనిట్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హీరో మరియు యూనిట్ సభ్యులు మెట్రోలో సందడి చేశారు.

మెట్రో రైలులో ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేస్తూ వారితో ఫొటోలు దిగుతూ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సినిమా థియేటర్లను మీ కోసం రెడీ చేశాం. మీ అందరు సినిమాను చూసినట్లయితే 500 థియేటర్ల యాజమాన్యాలకు అందులో పని చేసే సిబ్బందికి సాయం చేసిన వారు అవుతారంటూ ఉన్న కరపత్రంను విభిన్నంగా పంచుతూ అంతా కూడా సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెట్రో ట్రైన్ లో అంత మందితో ప్రయాణించే సమయంలో మాస్క్ పెట్టుకుని ఉంటే మరింత బాగుండేది కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.