Begin typing your search above and press return to search.

కిర‌ణ్ అబ్బ‌వ‌రాన్ని శ‌పించిన మాష్టారు!

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 AM GMT
కిర‌ణ్ అబ్బ‌వ‌రాన్ని శ‌పించిన మాష్టారు!
X
యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి ఇండ‌స్ర్టీలో స‌క్సెస్ అయిన మ‌రో హీరో. నాని..విజ‌య్ దేవ‌ర‌కొండ..విశ్వ‌క్ సేన్ త‌ర‌హాలోనే కిర‌ణ్ త‌క్కువ టైమ్ లోనే ఎస్టాబ్లిష్ అయ్యాడు. బిగ్ బ్యాన‌ర్స్ లో అవ‌కాశాలు అందుకుంటూ మ‌రింత ఫేమ‌స్ అవుతున్నాడు. ఇలా వ‌చ్చి స‌క్సెస్ అవ్వ‌డం వెనుక ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలుంటాయి. వాట‌న్నింటిని దాటుకుని ముందుకెళ్తేనే గెలుపు గుర్రం ఎక్క‌గ‌లం. అలాంటి వాళ్ల‌లో కిర‌ణ్ కూడా ఒక‌రు.

బ్యాక్ గ్రౌండ్ లేద‌ని ఫీల‌వ్వ‌లేదు. క‌ష్టాన్ని మాత్రమే న‌మ్ముకుని ముందుకు సాగాడు స‌క్సెస్ అయ్యాడు. చిన్న నాటి నుంచి సినిమాలంటే పిచ్చి. కానీ ప్ర‌య‌త్నించాలంటే స‌క్సెస్ అవుతామా? లేదా? అన్న భ‌యం సందేహం. ఆ భ‌యంతోనే కొన్నాళ్ల పాటు ఉద్యోగం. కానీ సంతృప్తినివ్వ‌ని జాబ్ మ‌ళ్లీ సినిమా రంగంవైపు ప్ర‌యాణించేలా చేసింది.

అయితే కిర‌ణ్ జీవితం..సినిమా రెండు కూడా న‌ల్లేరు మీద న‌క‌డ‌న్న చందంగానే సాగిన‌ట్లు క‌నిపిస్తుంది. కాలేజీలో మాష్టారు శాప‌న అత‌న్ని ఇంత వ‌ర‌కూ తీసుకొచ్చింద‌న‌డానికి మ‌రో కార‌ణంగాను చెప్పొచ్చు. కాలేజీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్. టీచ‌ర్లు అందరికీ వీడు పాస్ అవ్వ‌డు అన్న బ‌ల‌మైన న‌మ్మ‌కం. అందుకే మాష్టారు ఏ బ‌స్టాండ్ లోనే బ‌టానీలు అమ్ముకుని బ్ర‌త‌క‌డం త‌ప్ప‌..నీ జీవితం ఇంతేన‌ని ఆనాడే శ‌పించారు.

కానీ అనుకోకుండా కిర‌ణ్ చ‌దువు పూర్త‌వ్వ‌డం..ఆ వెంట‌నే కాలీజీలో మొద‌ట కిర‌ణ్ కే ఉద్యోగం రావ‌డం అంతా అత‌నికే షాకింగ్ అనిపించింది. చూస్తుండ‌గానే 70 వేల జీతగాడు అయ్యాడు. ఎర్లీ ఏజ్ లో ఉద్యోగం రావ‌డంతో త‌న గ‌మ‌నాన్ని మార్చుకున్నాడు. తాను అనుకున్న‌ది సాధించ‌డానికి ప‌దేళ్లు స‌మ‌యం ఉంద‌ని మ‌న‌సులో బ‌లంగా సంక‌ల్పించి ఉద్యోగం మానేసి షార్ట్ పిలింస్ తీయ‌డం మొద‌లుపెట్టాడు.

అప్పుడు కూడా తాను స‌క్సెస్ అవుతానా? లేదా? అన్న సందేహాలు వెంటాడాయి. కానీ అనుకోకుండా సినిమా అవ‌కాశాలు రావ‌డం...స‌క్సెస్ అవ్వ‌డం అంతా చాలా వేగంగా జ‌రిగిపోయింది. నేడు స్టార్ గా నిల‌బ‌డినా? ఇంకా నేను హీరోనేనా? అన్న సందేహం ఎక్క‌డో త‌డుతూనే ఉంటుందిట‌. అయితే కిర‌ణ్ స‌క్సెస్ అవ్వ‌డం అన్న‌ది కొంద‌రికి న‌చ్చ‌ని విష‌యంగానూ తెలుస్తోంది.

తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు క‌ష్టాలిపోవాల‌నుకున్న వారు ఇప్పుడు కిర‌ణ్ కి ఇన్ని అవకాశాలు ఎలా వ‌స్తున్నాయ‌ని లెక్క‌లు వేయ‌డం మొద‌లైంద‌ని అంటున్నాడు. వాళ్ల తీరు ఏం అర్ధం కాలేద‌ని? అస‌లు సోసైటీ ఇలా ఆలోచిస్తుంది? ఏంటి? అని గ‌ట్టిగానే వాళ్ల‌పై కాన్సంట్రేట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇక కిర‌ణ్ ని శ‌పించిన అదే మాష్టారు ఇప్పుడు ఆ హీరో న‌టించిన సినిమాలు థియేట‌ర్లో బ‌ఠానీలు తింటూ చూస్తున్నాడంటూ ఓ ఇంట‌ర్వ్యూలో అలీ చ‌ర్చించ‌డం ఆస‌క్తిక‌రం.