Begin typing your search above and press return to search.

`ల‌వ్ స్టోరి` కోసం బ‌రిలో దిగ్గ‌జ స్నేహితులు

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:30 PM GMT
`ల‌వ్ స్టోరి` కోసం బ‌రిలో దిగ్గ‌జ స్నేహితులు
X
కింగ్ నాగార్జున వార‌సుడు.. యంగ్ హీరో నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సాయి ప‌ల్ల‌వి ఇందులో చైతూకి జ‌త‌గా నటించింది. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నారాయ‌ణ‌దాస్ నారంగ్‌- పుస్కూర్ రామ్మోహ‌న్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్ల‌వి న‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ ప‌లు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రిక‌ల్ రిలీజ్ ని చిత్ర బృందం ఖ‌రారు చేసింది. ఈ నెల 24న ఈ చిత్రం థియేట్రిక‌ల్ రిలీజ్ కాబోతోంది.

ఇప్ప‌టికే పాట‌ల‌తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ఈ మూవీ తెలంగాణలోని మూరుమూల గ్రామాల నుంచి హైద‌రాబాద్ సిటీకి చేరుకున్న ఇద్ద‌రు ప్రేమికుల క‌థ‌గా రూపొందించారు. హీరో హీరోయిన్ తెలంగాణ యాస‌లో ప‌లికే సంభాష‌ణ‌లు ఇప్ప‌టికే సినిమాపై మంచి బ‌జ్ ని క్రియేట్ చేశాయి. ప‌వ‌న్‌ సీహెచ్ అందించిన సంగీతం ఇప్ప‌టికే చార్టుబ‌స్ట‌ర్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. పైగా ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌విపై చిత్రీక‌రించిన `సారంగ ద‌రియా ..` యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తూ మ‌రింత హైప్ ని క్రియేట్ చేసింది.

ఈ మూవీ రిలీజ్ మ‌రో వారం రోజులు వుండ‌టంతో మేక‌ర్స్ ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని మొద‌లుపెట్టేశారు. ఇప్ప‌టికే హీరో నాగ‌చైత‌న్య ప‌లు ఆంగ్ల ప‌త్రిక‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం స్టార్ట్ చేశారు. ఇదిలా వుంటే ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుక‌ని ఈ ఆదివారం గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇద్ద‌రు మిత్రులైన దిగ్గ‌జ హీరోల‌ని ప్ర‌త్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నార‌ని తెలిసింది. ఆ ఇద్ద‌రు

ఇంత‌కీ ఎవ‌రా దిగ్గ‌జ హీరోలు? అంటే.. మంచి మిత్రులు మ‌రెవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున‌. వీరిద్ద‌రి ఎంట్రీతో ఈ సినిమా ప్ర‌చారానికి మ‌రింత ఊపుని తీసుకురావాల‌న్న‌ది మేక‌ర్స్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఆదివారం జ‌ర‌గ‌బోయే ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ఆశీస్సుల‌ను కింగ్ నాగార్జున వారసుడు అందుకోనున్నారు. చిరు ఈ వేదిక‌పై చైతూ గురించి ఏం చెబుతారో చూడాల‌ని మెగా ఫ్యాన్స్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చైతూ ల‌వ్ స్టోరీకి మెగా ఫ్యాన్స్ నుంచి బూస్ట్ దొర‌క‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.