టాలీవుడ్ హీరో - బాలీవుడ్ బ్యూటీ బ్రేకప్

Mon Apr 22 2019 17:29:26 GMT+0530 (IST)

Kim Sharma and Harshvardhan Rane end relationship

ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అని తెలుగులో ఒక పాత పాట ఉంది.  నిజమే ఎవరూ ఊహించలేం.  అదీ బాలీవుడ్ జంటల ప్రేమాయణాలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో ఎప్పుడు బ్రేకప్ దిశగా సాగుతాయో కాకలు తీరిన బాలీవుడ్ పేజి 3 జర్నలిస్టులు కూడా ఊహించలేరు.  అయితే హింట్స్ వస్తే మాత్రం రిపోర్ట్ చేయగలరు అంతే.హీరో హర్షవర్ధన్ రాణే తెలుసు కదా..'తకిట తకిట' తో ఎంట్రీ ఇచ్చి దాదాపు డజను టాలీవుడ్ సినిమాల్లో నటించాడు.  అప్పుడప్పుడూ బాలీవుడ్ సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తుంటాడు.  ఈ హర్షవర్ధన్ బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే.  కిమ్ తెలుసు కదా..? పలు హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామ తెలుగులో 'ఖడ్గం' సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో కూడా నర్తించింది. ఈవిడకు ఆల్రెడీ కెన్యాకు చెందినా అలీ పుంజాని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకోవడం.. తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో  విడాకులు తీసుకోవడం జరిగింది.  అలా మళ్ళీ సింగిల్ గా మారినప్పుడే ఈ చాకులాంటి హర్షవర్థన్ తో మింగిల్ అయింది. ఇద్దరూ కలిసి ప్రేమపక్షుల్లాగా తెగ తిరిగారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా బాలీవుడ్ లో టాక్ ఉంది.  లాస్ట్ డిసెంబర్ లో ఈ ఎఫైర్ గురించి మాట్లాడుతూ 'కిమ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నమాట నిజమే'నని అంగీకరించాడు.  

తాజా సమాచారం ఏంటంటే ఇద్దరూ బ్రేకప్.. బ్రేకప్.. బ్రేకప్ చెప్పుకున్నారట.  ఒక నెల క్రితం ఈ ప్రేమ పక్షుల మధ్య గొడవ జరిగి అది చిలికి చిలికి గాలివానలాగా మారి విడిపోయేవరకూ వచ్చిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  కానీ అటు హర్షవర్ధన్ కానీ ఇటు కిమ్ కానీ ఈ వార్తలపై కిమ్మనకుండా ఊరుకున్నారు.  అయితే హర్షవర్ధన్ పబ్లిసిస్ట్ ఈమధ్య ఒక బాలీవుడ్ పోర్టల్ తో మాట్లాడుతూ హర్షవర్ధన్ - కిమ్ లు విడిపోయిన మాట నిజమేనని.. మళ్ళీ కలిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చాడట. దీంతో టాలీవుడ్ హీరో - బాలీవుడ్ బ్యూటీ ల ప్రేమబంధం అర్థాంతరంగా ముగిసిపోయినట్టే.