Begin typing your search above and press return to search.

నిత్య ప్రేమాయ‌ణాల హాటీ ఇప్పుడేం చేస్తోంది?

By:  Tupaki Desk   |   23 Jan 2022 7:21 AM GMT
నిత్య ప్రేమాయ‌ణాల హాటీ ఇప్పుడేం చేస్తోంది?
X
నిత్య ప్రేమాయ‌ణాల‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది కిమ్ శ‌ర్మ‌. `ఖ‌డ్గం` ఫేం కిమ్ శర్మ నిన్నటితో 42వ ఏట అడుగుపెట్టింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అభిమానులు బాలీవుడ్ పరిశ్రమ నుండి త‌న‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విష‌యం ఒక‌టి ఉంది.

త‌న ప్రేమికుడు అయిన టెన్నిస్ ఆట‌గాడు లియాండర్ పేస్ నుండి ఎలాంటి రిప్ల‌య్ ఉంటుందో చూడాలనేది అంద‌రి ఆస‌క్తి. నిన్న‌టిరోజున‌ టెన్నిస్ ఆటగాడు లియాండ‌ర్ ఫేస్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కిమ్ తో డ్రీమింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఫోటోగ్రాఫ్ లలో ఒకదానిలో ఈ అంద‌మైన‌ జంట ఒకరి కళ్లలోకి మరొకరు త‌న్మ‌యంగా చూసుకోవడం కనిపించింది. మరొకదానిలో కిమ్ బ్యాక్ గ్రౌండ్ లో బెలూన్ లతో కెమెరాకు పోజులిస్తూ కనిపించింది. ఈ ఫోటోలను పంచుకుంటూ.. పేస్ తన లేడీ లవ్ కోసం హృదయపూర్వక నోట్ ను రాశాడు. “హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ కిమ్ శర్మ. మీ కోసం నా కోరిక మీలాగే.. ఇది అద్భుత సంవత్సరం” అని వ్యాఖ్య‌ను జోడించారు.

తాజాగా కిమ్ తన సోషల్ మీడియా లో ఈ వ‌రుస ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. 42 లోకి ప్రవేశించినప్పుడు ఒక ఒంట‌రి దీవి నుండి ఫోటోల‌ను పంచుకుంది. కిమ్ బీచ్ బికినీల‌తో ఫుల్ గా కిక్ లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. వాటిని షేర్ చేస్తూ బహామాస్ లోని అత్యుత్తమ వ్యక్తితో తనకు ఇది మంచి రోజు అని కిమ్ పేర్కొంది. ఈ పోస్ట్ లో లియాండర్ పేస్ ను ట్యాగ్ చేసింది. “మూడ్ 2022. స్వర్గంలో నా ఉత్తమ వ్యక్తితో ఉత్తమ రోజు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండవచ్చు! నాకు జన్మదిన శుభాకాంక్షలు`` అని ఆమె ఆ ఫోటోల క్రెడిట్ ను తన ప్రియుడు పేస్ కు ఇచ్చింది. కిమ్ శ‌ర్మ‌ పోస్ట్ అభిమానుల హృదయాలను ఆకర్షించింది. వారు హార్ట్ ఎమోటికాన్ లతో వ్యాఖ్యల‌ విభాగాన్ని నింపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కిమ్ మొహబ్బ‌తీన్ లో జిమ్మీ షీర్ గిల్ తో కలిసి నటించడం ద్వారా పాపుల‌రైంది. ఆమె పద్మశ్రీ లాలూ ప్రసాద్ యాదవ్- కుడియోన్ కా హై జమానా- మనీ హై తో హనీ హై- తాజ్ మహల్: యాన్ ఎటర్నల్ లవ్ స్టోరీ - త‌దిత‌ర‌ చిత్రాలలో న‌టించింది. ఆ త‌ర్వాత తెలుగు త‌కిట త‌కిట హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తో ప్రేమ‌లో ప‌డినా అది కూడా బ్రేక‌ప్ అయ్యింది. ఖ‌డ్గంలో శ్రీ‌కాంత్ స‌ర‌స‌న ఈ బ్యూటీ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

క్రీడాకారుడితో న‌టి ఘాటు ల‌వ్..!

కిమ్ గత కొంతకాలంగా లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ తో డేటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట రిలేష‌న్ షిప్ ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారింది. కిమ్ తరచుగా లియాండర్ తో రొమాంటిక్ గా ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తోంది. ఇవ‌న్నీ కుర్రాళ్ల గుండెల్లో ఎరుపు రంగులో పెయింటింగ్ చేస్తూ దూసుకెళుతున్నాయి. 2022ని ఈ జంట‌ స్వాగతిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోలలో కిమ్ - లియాండర్ తెల్లటి డ్రెస్ లో అందంగా క‌నిపించారు.

ఇంతకుముందు ప‌లుమార్లు ఈ ప్రేమపక్షులు కెమెరా కంటికి చిక్కాయి. తమ కుటుంబ సభ్యులతో 2021 డిసెంబ‌ర్ చివ‌రిలో క్రిస్మస్ వేడుకల్లోనూ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. వేడుక‌ల నుంచి అరుదైన ఫోటోలతో అభిమానులను అభిమానుల‌కు షేర్ చేసారు. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ ఈ సెల‌బ్రేష‌న్స్ కొన‌సాగాయి. లియాండ‌ర్ ఫేస్ కంటే ముందు కిమ్ న‌లుగురితో ప్రేమాయ‌ణాలు సాగించిన సంగ‌తి త‌లిసిందే.