Begin typing your search above and press return to search.

క్రిప్టోక‌రెన్సీలో బుక్క‌యిన మ‌రో స్టార్ సెల‌బ్రిటీ

By:  Tupaki Desk   |   5 Oct 2022 6:40 AM GMT
క్రిప్టోక‌రెన్సీలో బుక్క‌యిన మ‌రో స్టార్ సెల‌బ్రిటీ
X
క్రిప్టోకరెన్సీలో పెట్టుబ‌డులు చాలామంది జీవితాల‌ను తారుమారు చేసిన సంగ‌తి తెలిసిందే. క్రిప్టోక‌రెన్సీ నియంత్ర‌ణ‌పై భార‌త ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు రేపాయి. క‌రెన్సీ విలువ దారుణంగా ప‌డిపోవ‌డంతో ధ‌న‌వంతులు కావాల‌నుకున్న చాలామంది ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి.

అయితే డార్క్ వెబ్ బేస్ చేసుకుని మంత్రాంగం న‌డిపించే క్రిప్టోక‌రెన్సీకి చట్టవిరుద్ధంగా ప్రచారం చేశారనే నెపంతో ప్ర‌ముఖ న‌టి కం గాయ‌ని కిమ్ కర్దాషియాన్ కి శిక్ష ప‌డింది. స‌ద‌రు గాయ‌ని డ్యామేజీకి అనుగుణంగా 1.26 మిలియన్ డాలర్లు చెల్లించాలి. చట్టవిరుద్ధంగా క్రిప్టోకరెన్సీని ప్రచారం చేశారనే ఆరోపణల మధ్య సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ తో సెటిల్ మెంట్ లో కిమ్ 1.26 మిలియన్ల డాల‌ర్ల చెల్లింపుపై తీర్పు వెలువ‌డింది.

కిమ్ కర్దాషియాన్ ప్రమోషన్ కోసం అందుకున్న మొత్తాన్ని బహిర్గతం చేయకుండా దాచింది. క్రిప్టో ఆస్తి భద్రతకు సంబంధించి స‌ద‌రు న‌టీమ‌ణిపై ఆరోపణలు రావడంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ తో సెటిల్‌మెంట్ లో చెల్లించడానికి కిమ్ అంగీకరించారు.

ప్ర‌ఖ్యాత వెరైటీ నివేదికల ప్రకారం సెక్యూరిటీ ఎక్స్ ఛేంజ్ ఆర్డర్ ప్రకారం ఎథురియ‌మ్ మ్యాక్స్ అందించే క్రిప్టో అసెట్ సెక్యూరిటీ అయిన EMAX టోకెన్ ల గురించి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ ను ప్రచురించడానికి ఆమెకు 2.5ల‌క్ష‌ల డాల‌ర్లు చెల్లించినట్లు వెల్లడించడంలో కర్దాషియాన్ విఫలమయ్యారు. కర్దాషియాన్ పోస్ట్ ఎథురియ‌మ్ మ్యాక్స్ వెబ్ సైట్ కి లింక్ చేయడంతో అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింది. ఈ ప్ర‌చారంతో పెట్టుబడిదారులు EMAX టోకెన్ లను ఇబ్బ‌డిముబ్బ‌డిగా కొనుగోలు చేయడానికి కార‌ణ‌మైంది.

క్రిప్టో అసెట్ సెక్యూరిటీలు సహా సెలబ్రిటీలు లేదా ఇన్ ఫ్లుయెన్సర్ లు పెట్టుబడి అవకాశాలపై ప్ర‌చారం చేసిన‌ప్పుడు లేదా ఆమోదించినప్పుడు పెట్టుబడిదారులందరూ దీనిని న‌మ్మాల్సిన అవ‌స‌రం లేద‌ని ఈ కేసు రిమైండర్ గా నిలుస్తుంద‌ని SEC చైర్ పర్సన్ గ్యారీ జెన్స్‌లర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలబ్రిటీలు లేదా ఇతరులకు సెక్యూరిటీలలో పెట్టుబడిని ప్రోత్సహించడానికి వారు ఎప్పుడు ఎంత చెల్లించారో ప్రజలకు తెలియజేయాలని చట్టం కోరుతుందని కర్దాషియాన్ కేసు గుర్తు చేసింది.

సెటిల్‌మెంట్ ప్రకారం-``SEC ఫలితాలను అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా కర్దాషియన్ మూడు సంవత్సరాల పాటు ఎటువంటి క్రిప్టో ఆస్తి సెక్యూరిటీలను ప్రోత్సహించకూడదని అంగీకరించారు. కర్దాషియాన్ తరపు న్యాయవాది అవుట్ లెట్ కి ఒక ప్రకటనలో ఇలా అన్నారు. SECతో ఈ విషయాన్ని పరిష్కరించినందుకు కర్దాషియన్ సంతోషిస్తున్నార‌ని అన్నారు.

కర్దాషియాన్ మొదటి నుండి SECకి పూర్తిగా సహకరించింది. ఈ విషయంలో SECకి సహాయం చేయడానికి ఆమె చేయగలిగినదంతా చేయడానికి సిద్ధంగా ఉంది. సుదీర్ఘ వివాదాన్ని ఆపేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తోంది. SECతో కుదుర్చుకున్న ఒప్పందం ఆమెను ఆ పని చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా ఆమె అనేక విభిన్న వ్యాపార కార్యకలాపాలతో ముందుకు సాగవచ్చు.. అని అన్నారు.

జూన్ 2021లో తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి పోస్ట్ ల శ్రేణిలో కర్దాషియాన్ తన అనుచరులను ఇలా ప్రేరేపించారు. ``మీరు క్రిప్టోలో ఉన్నారా??? ఇది ఆర్థిక సలహా కాదు... కానీ నా స్నేహితులు ఎథిరియ‌మ్ మాక్స్ టోకెన్ గురించి నాకు చెప్పిన త‌ర్వాత‌ వాటిని మీకు షేర్ చేస్తున్నాను!`` అని రాసారు.

దాంతో కిమ్ అనుచరులు ఎథిరియ‌మ్ Max వెబ్ సైట్ కి వెళ్లడానికి E-Max సంఘంలో చేరడానికి ప్రోత్సహించబడ్డారు. ఆమె పోస్ట్ లో #AD అనే హ్యాష్ ట్యాగ్ ఉంది. ఇది డ‌బ్బు లావాదేవీలు చెల్లింపు ప్రమోషన్ అని సూచిస్తున్నాయి. అయితే 1.26 మిలియన్ల డాల‌ర్ల‌ జరిమానాకు దారితీసే క్రిప్టో పెట్టుబడులకు ఈ స్థాయి ప్ర‌చారం సరిపోదని SEC చెప్పింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.