మహేష్ చోటా ఫ్యాన్స్ ఇరగదీశారుగా..

Tue Aug 11 2020 19:30:24 GMT+0530 (IST)

Kid Imitates Mahesh Babu

నాలుగైదేళ్ల నుంచి పది పన్నెండేళ్ల పిల్లలు వాళ్లందరూ. అయితేనేం ఉత్సాహానికి అభిమానానికి కొదవేమీ లేదు. తమ అభిమాన కథానాయకుడి కొత్త సినిమాలో హైలైట్ అయిన ఓ సన్నివేశం తీసుకున్నారు. అందులో ఒకరు హీరో ఇంకొకరు విలన్.. మిగతా వాళ్లలో కొందరు రౌడీలు. ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు. అందరూ కలిసి సదరు సన్నివేశాన్ని తమ స్టయిల్లో రూపొందించే ప్రయత్నం చేశారు. మొబైల్ కెమెరాతోనే చిత్రీకరణ. తమదైన శైలిలో యాక్ట్ చేస్తూ.. ఎఫెక్ట్స్ జోడిస్తూ.. వాళ్ల స్థాయిలో అద్భుతంగా ఆ వీడియోను రూపొందించారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చోటా ఫ్యాన్స్ క్రెడిట్టే ఇదంతా.మొన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కొందరు పల్లెటూరి పిల్లలు చేసిన వీడియోకు అదిరిపోయే స్పందన వస్తోంది. మహేష్ సంక్రాంతి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఇంటర్వెల్ యాక్షన్ ఘట్టాన్ని ఇమిటేట్ చేస్తూ ఓ పది మంది చిన్నారులు చేసిన వీడియో చూసిన వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. ‘సరిలేరు..’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లల ఎనర్జీని క్రియేటివిటీని అభినందిస్తూ పోస్టు పెట్టాడు. వీళ్లతో ఎవరైనా పెద్దవాళ్లే ఆ వీడియో చేయించి ఉండొచ్చు కానీ.. వాళ్ల హావభావాలు ఈ వీడియో కోసం పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం వావ్ అనిపించకుండా ఉండవు. ముఖ్యంగా ఈ వీడియోలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించిన ఐడియాలు స్లో మోషన్ షాట్లు భలే ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్ లో - ఫేస్ బుక్ లో - ట్విట్టర్లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది రెండు రోజులుగా.