Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఆ హీరోతో రొమ‌న్స్ కి రెడీ అయిన కియారా!

By:  Tupaki Desk   |   14 Oct 2021 9:31 AM GMT
మ‌ళ్లీ ఆ హీరోతో రొమ‌న్స్ కి రెడీ అయిన కియారా!
X
షాహిద్ క‌పూర్-కియారా అద్వాణీ జంట‌గా సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కించిన `క‌బీర్ సింగ్` బాలీవుడ్ లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అర్జున్ రెడ్డి`నే మాతృక ద‌ర్శ‌కుడు బాలీవుడ్ లోనూ రీమేక్ చేసి అక్క‌డా సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకున్నారు. ఇలా రెండు భాష‌ల్లోనూ సందీప్ ఊహించ‌ని అందుకోవ‌డంతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరొచ్చింది. ఆ స‌క్సెస్ బాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు తెచ్చిపెట్టింది. ఇక షాహిద్-కియారా మ‌ధ్య వ‌ర్కౌటైన కెమిస్ర్టీ కి స్ర్కీన్ పై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కియారా కెరీర్ ఆరంభంలోనూ బెస్ట్ పెర్పార్మ‌ర్ గాను ప్రూవ్ చేసుకుంది. ఆ స‌క్సెస్ బాలీవుడ్ లో పూల బాట‌ని వేసింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ న‌టీమ‌ణుల్లో కియారా ఒక‌రిగా మారారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఉందా? మ‌ళ్లీ అలాంటి కెమిస్ర్టీ ఇద్ద‌రి మ‌ధ్య కుదురుతుందా? అని ప్ర‌శ్నించ‌గా త‌ప్ప‌కుండా అంటూ బ‌ధులిచ్చింది. క‌బీర్ సింగ్ లాంటి స్ర్కిప్ట్ ని మిస్ చేసుకోకూడ‌దు. నా కెరీర్ లో ఉత్త‌మ చిత్రంగా చెప్పుకుంటాను. అలాంటి క‌థ‌లు చాలా అరుదుగా వ‌స్తాయి. షాహిద్ లాంటి న‌టుడిగాతో న‌టించ‌డం బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్ ని ఇచ్చింది. ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర చేసిన సినిమా ఇది. ప్రేక్ష‌కాభిమానులు ఆశిస్తున్న‌ట్లు మ‌ళ్లీ షాహిద్ తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే అస్స‌లు వ‌దులుకోను. అలా జ‌ర‌గాల‌ని ఆ దేవుణ్ని నేను కూడా కోరుకుంటాను అని కియారా తెలిపింది.

ప్ర‌స్తుతం కియారా అద్వాణీ తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఇటీవ‌లే షేర్ షా చిత్రంతో బాలీవుడ లో మ‌రో స‌క్సె్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్..ట‌బు..కియారా ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనీస్ బ‌జ్మీ ద‌ర్శ‌క‌త్వంలో `బూల్ భులాయా-2` అనే హారర్ కామెడీ చిత్రం తెర‌కెక్కుతోంది. మ‌రోవైపు రాజ్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో `జ‌గ్ జ‌గ్ జియో`లో న‌టిస్తోంది. ఇటీవ‌లే కియారా `మిస్ట‌ర్ లీలే` చిత్రం షూటింగ్ కూడా పూర్తిచేసింది.