Begin typing your search above and press return to search.

కియ‌రా వెడ్స్ సిధ్: 70 కోట్ల ఖ‌రీదైన సీ-వ్యూ బంగ్లాలో కాపురం?

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 PM GMT
కియ‌రా వెడ్స్ సిధ్: 70 కోట్ల ఖ‌రీదైన సీ-వ్యూ బంగ్లాలో కాపురం?
X
ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాని గ‌డుస‌రి కియారా అద్వానీ పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. సిద్ తో ఏడడుగులు న‌డిచేందుకు సిద్ధ‌మైన కియ‌రా అద్వాణీ పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫోటోల బంచ్ అంత‌ర్జాలంలోకి వ‌చ్చేందుకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. అయితే ఈ పెళ్లి నుంచి అధికారికంగా ఎలాంటి ఫోటోలు బ‌య‌ట‌కు రావు. కేవ‌లం కొన్ని స్మార్ట్ ఫోన్ స్నాప్ ల‌ను మాత్ర‌మే సోష‌ల్ మీడియాల్లో వీక్షించే వెసులుబాటు ఉంది. అవి కూడా అతిథులు అత్యుత్సాహంతో లీక్ చేస్తే. లేదా అర‌కొర బంధుమిత్రులు రిలీజ్ చేస్తేనే! అలాగే ఈ పెళ్లి వేడుక‌ను ప్ర‌ముఖ ఓటీటీకి గంప‌గుత్త‌గా రైట్స్ కి విక్ర‌యించిన సంగ‌తి విధిత‌మే.

తాజా స‌మాచారం మేర‌కు సిద్ధార్థ్- కియ‌రా పెళ్లి అనంత‌రం తమ ఫ్యామిలీ లైఫ్ ని సంపూర్ణంగా ఆస్వాధించేందుకు సొంత గూడు వెతుకుతున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ జంట ఒక అంద‌మైన ఇల్లు కోసం వేటలో ఉన్నారు. ఒక ప్ర‌ముఖ బాలీవుడ్ పోర్టల్ తో మాట్లాడుతూ.. సిధ్ కొత్త కాపురం కోసం జుహులో సముద్రానికి ఎదురుగా(సీ ఫేసింగ్) ఉండే ఇల్లు కోసం ప్రయత్నిస్తున్నాన‌ని తెలిపారు.

సిద్ధార్థ్ తన బాంద్రా ప్యాడ్ లాగానే అరేబియా సముద్ర కెర‌టాల‌ను వీక్షిస్తూ త‌న లైఫ్ ని స‌రికొత్త‌గా ప్రారంభించాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. భార్య‌తో క‌లిసి అద్భుత‌మైన‌ అనియంత్రిత బ్లూవాట‌ర్స్ ని సుదీర్ఘ‌ తీరాన్ని వీక్షించే అనుభ‌వాన్ని పొందేందుకు సముద్రానికి ఎదురుగా ఉండే ఇంటిని కొనాల‌నుకుంటున్నాడు'' అని క‌థ‌నాలొస్తున్నాయి.

సిధ్ ఇప్ప‌టికే కొన్ని ప్రాపర్టీలను వీక్షించారు. అందులో ఒక ఇంటి ధర రూ. 70 కోట్లు!. అయితే... సిదార్థ్ మ‌ల్హోత్రా ఇంకా దేనినీ ఖరారు చేయలేదు. షార్ట్ లిస్ట్ చేసిన అన్ని ఇళ్లలో ఒకదానిలో ఫైన‌ల్ చేసే ముందు మళ్లీ అత‌డు తనిఖీ చేస్తాడు. షాదీ తర్వాత అతని కలల బంగ్లా సిద్ధమయ్యే వరకు న‌వ‌దంపతులు అతని పాలి హిల్ ఇంటిలోకి మారతారు'' అని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సిద్ధార్థ్ ఇంకా స్పందించలేదు.

చాలా కాలంగా రహస్యంగా డేటింగ్ చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ ఫిబ్రవరి 7 న రాజస్థాన్‌- జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో వివాహానికి సిద్ధమ‌య్యారు. అన్ని ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలు ఫిబ్రవరి 5 - 6 తేదీల్లో రెండ్రోజుల పాటు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.

తాజా క‌థ‌నాల‌ ప్రకారం ఈ జంట‌ సంగీత్ ఈరోజు(6 ఫిబ్ర‌వ‌రి) సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. పెళ్లి తర్వాత సిద్ధార్థ్ -కియారా రెండు గ్రాండ్ రిసెప్షన్లను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకటి ఫిబ్రవరి 12న ముంబైలోని తమ (కొత్త జంట‌) ఇండస్ట్రీ స్నేహితుల కోసం.. మరొకటి ఢిల్లీలోని వరుడి కుటుంబం కోసం గ్రాండ్ గా విందు ఏర్పాటు చేస్తార‌ని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.