వీడియో: కియరా రెడ్ హాట్ బికినీ అందాలు

Thu Jun 10 2021 19:00:01 GMT+0530 (IST)

Kiara Latest Instagram Post

బాలీవుడ్ లో క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉన్న కియరా అద్వాణీ ఇంతకుముందు మాల్దీవుల విహారంలో బోయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడం హెడ్ లైన్స్ లోకి వచ్చింది. మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.అయితే ఇటీవల సెకండ్ వేవ్ నేపథ్యంలో సెలబ్రిటీ యాత్రలపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా గత కొంతకాలంగా కియరా లోప్రొఫైల్ ని మెయింటెయిన్ చేస్తోంది. రెండ్రోజుల క్రితం ఇన్ స్టాలో ఆక్వేరియంలో ఈదుతున్న వీడియోని షేర్ చేసింది. తాజాగా ఈరోజు ఇన్ స్టా వేదికగా రెడ్ హాట్ బికినీ షూట్ కి సంబంధించిన వీడియోని షేర్ చేసి ఒక్కసారిగా హీట్ పెంచింది. బికినీ బీచ్ లో ఎర్ర బికినీకి సంబంధించిన సెల్ఫీ వీడియో ఇది. కియరా సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది.

మిస్సింగ్ ది సన్ షైన్- ట్యాన్! అంటూ కాస్త నలతగానే కనిపిస్తోంది. నెలరోజులుగా ముంబైలో లాక్ డౌన్ వేయడంతో తన విహారయాత్రలకు చెక్ పడిపోయింది. అందుకే సూర్యరశ్మిని కూడా కోల్పోయానని బాధను వ్యక్తం చేస్తోంది. ఇప్పుడిప్పుడే ముంబై మహారాష్ట్ర చక్కబడుతున్నాయి. ఇకపై కియరా యథేచ్ఛగా విహార యాత్రలకు వెళ్లొచ్చు. షూటింగుల్లోనూ జాయినయ్యే ఛాన్సుంది.

కియరా కెరీర్ మ్యాటర్ కి వస్తే...సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `షెర్షా` లో కనిపిస్తుంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో `జగ్ జగ్ జీయో`లోనూ కియరా నటిస్తోంది. భూల్ భులయ్యా చిత్రంలోనూ కియరా కథానాయిక. పెండింగ్ చిత్రీకరణలు పూర్తి కావాల్సి ఉంటుంది.