ఆ ఇద్దరూ ఫ్రెగ్నెంట్స్.. ఇదే నా గుడ్ న్యూస్?

Thu Nov 14 2019 16:19:08 GMT+0530 (IST)

Kiara & Kareena flaunts their baby bump!

కిలాడీ అక్షయ్ కుమార్ - కరీనా కపూర్ జంట కెమిస్ట్రీ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈ జోడీ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ల తో అలరించారు. కిలాడీ తో బెబో కాంబినేషన్ అంటే బాలీవుడ్ లో యమ క్రేజీ. ఇంతకుముందు `గబ్బర్ ఈజ్ బ్యాక్` చిత్రం లో జోడీ గా నటించారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ గుడ్ న్యూస్ అంటూ అభిమానుల్ని పలకరించబోతున్నారు.ఆసక్తి కరమైన విషయం ఏమంటే గుడ్ న్యూజ్ అనేది బెబో- కిలాడీ జంట చెప్పబోతున్నదా లేక పోతే ఆ ఇద్దరి మధ్యా యంగ్ బ్యూటీ కియరా అద్వాణీ చెప్పబోతున్నదా? అన్నది సస్పెన్స్ గా మారింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. రెండు పోస్టర్లు రిలీజ్ చేస్తే ఒక దానిలో కిలాడీ అక్షయ్ తో పాటు గా దిల్జీత్ దోసాంజి కనిపించాడు. ఇరు వైపులా గర్భిణులు (కరీనా- కియరా) మధ్య ఆ ఇద్దరూ నలిగి పోతున్న పోస్టర్ ని  ఫన్ అండ్ సెటైరికల్ గానే రూపొందించారు. వేరొక పోస్టర్ లో ఓన్లీ కిలాడీ మాత్రమే ఆ ఇద్దరు గర్భిణుల మధ్య నలిగిపోతున్నాడు. అసలింతకీ ఆ ముగ్గురి మధ్యా ఏం జరుగుతోంది? అన్న దానిని ఫన్నీగా చూపిస్తున్నారని అర్థమవుతోంది.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో కిలాడీ అక్కీ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ సినిమా డిసెంబర్ 27న క్రిస్మస్ కానుకగా రిలీజవుతోంది. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తుండ  గా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కియరా గర్భిణి గా నటించడం అన్నది ఆసక్తి కరం. తన ఇమేజ్ కి భిన్నంగా ఈ అమ్మడు కొత్తగా ప్రయత్నిస్తోందన్నమాట.