కియరా.. పెళ్లికి పిలవని పేరంటం..

Sun Dec 05 2021 12:00:02 GMT+0530 (IST)

Kiara Advani shows off her curves

బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ క్రేజీ సినిమాల్లో నటిస్తోంది కియరా అద్వాణీ. ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లు మతులు చెడగొడుతున్నాయి. కియరా లేటెస్ట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తోంది. దాంతో పాటే కియరా గురించి ఒక ఆసక్తికర టాపిక్ నెటిజనుల్లో వైరల్ గా మారింది.ఇంతకీ అదేంటీ అంటే.. కియరాని పెళ్లికి పిలవలేదుట. అది కూడా తన క్లోజ్ ఫ్రెండ్!!  ఎవరా ఫ్రెండ్ అంటే.. ది గ్రేట్ లస్ట్ స్టోరీస్ ఫేం విక్కీ .. హాట్ హంక్.. విక్కీ కౌశల్-కత్రినా కౌఫ్ వివాహం రాజస్థాన్ లోని సవాయ్  మాధోపూర్ లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల9న బ్యాండ్ బాజాకు రంగం సిద్ధమైంది. కుటుంబ సభ్యులు..అత్యంత సన్నిహితులు..కొంత మంది బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలోనే ఈవేడుక జరుగుతుంది. కేవలం 120 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారు. అయితే ఈ వేడుకకు బాలీవుడ్ నటి కియారా అద్వాణీకి పిలుపు అందలేదని తెలిసింది.  `అజెండా అజ్ తక్` లో జరిగిన చాట్ లో ఈ టాపిక్  డిస్కషన్ కి వచ్చింది. కోస్టార్ విక్కీ కౌశల్ పెళ్లి గురించి కియారాని అడిగితే ఏమని స్పందించిందంటే?..

`సునాతో హైపర్ పతా నహీ..ముఝే తోహ్ ఇన్విట్ నహీ కియా` అని అంది. అంటే  నిజంగా నేను విన్నాను.. కానీ నాకు ఏమీ తెలియదు. నాకు ఇప్పటివరకూ  పెళ్లికి ఆహ్వానమైతే అందలేదని తెలిపింది. ఇక కియారా-విక్కీ కౌశల్  జంటగా కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ లస్ట్ స్టోరీస్ లోనూ నటించారు. నెట్ ప్లిక్స్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ కి ఆ ఇద్దరు కారణంగా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులు కూడా అయ్యారని బాలీవుడ్ వర్గాల సమాచారం. కత్రినా- కియారా మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది.  ఇద్దరు వ్యక్తిగత ఫోటో షూట్లలో  కూడా జంటగా పాల్గొంటారు.

కానీ ఇప్పుడు విక్కీ- క్యాట్ వివాహానికి మాత్రం కియారాకి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.  అయితే కియారా మీడియాకి నిజమే చెప్పిందా?  లేక ఆహ్వానం అందలేదు అని జోక్ చేసిందా? అన్నది మరో సందేహం. ఎందుకంటే కియారా అన్ని విషయాల్ని ఓపెన్ గా చెప్పదు. ఎంతో డౌన్ టూ ఎర్త్. అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి స్పందిస్తుంది. కేవలం  అతికొద్దిమంది సమక్షంలోనే వేడుక జరుగుతుంది కాబట్టి తాను వెనక్కి తగ్గాలనే ఉద్దేశంతో అలా మాట్లాడిందా? అని కొంత మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.