డీసెంట్ లుక్కులో కూడా గ్లామర్ షో ఆపట్లేదుగా మహేష్ సుందరి!!

Mon Aug 03 2020 12:40:32 GMT+0530 (IST)

Kiara Advani Traditional Look

2018లో మహేష్ బాబు హీరోగా రూపొందిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన భామ కియారా అద్వానీ. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలోమంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముంబై భామ 2014లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి 'ఫుగ్లీ' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇక ఫస్ట్ సినిమానే ప్రిన్స్ మహేష్ బాబుతో నటించేసరికి అమ్మడికి తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆ సినిమా పరాజయం పాలయ్యే సరికి కియారా అందాలను పట్టించుకోవడం మానేసారు. కానీ అమ్మడు ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే క్రేజ్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ తెర పై కియారా సెన్సేషన్ అయి పోయింది. అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్ తో జోడీ  కట్టింది ఈ భామ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి కియారా కోసం స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు.అయినా అప్పటికే ఎంఎస్ ధోని బయోపిక్ తో మంచి ప్రశంసలు అందుకుంది కియారా. ఇక 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ లో తనలోని మరో నటిని బయటికి చూపించింది. అందు లో కియారా నటించిన తీరు చూసి విమర్శకులు సైతం ప్రశంసించారు. పాత్ర కొంచం కష్టమే.. కానీ అలాంటి పాత్ర తర్వాత ఎలాంటి పాత్రనైనా చేయగలదని అర్ధమవుతుంది. కియారాకు గ్లామర్ షో అనేది చిన్న విషయమే. ఎందుకంటే ఆమె బాలీవుడ్ లో పాఠాలు నేర్చుకుంది కాబట్టి. తాజాగా అమ్మడు సోషల్ మీడియా లో అదిరి పోయే ఫోటో పోస్ట్ చేసింది. కియారాకి సోషల్ మీడియాలో కోటికి పైనే ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అవుతుంది. ఫోటోషూట్స్ లో అందాలు ఆరబోయడం కియారాకి కొత్త కాదు. మ్యాగజైన్స్ కోసం టాప్ లెస్ పోజులు కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం అమ్మడు డీసెంట్ లుక్ లో హాఫ్ సారీ టైపు పోస్ట్ చేసింది. చూడముచ్చటగా.. అందాలన్నీ బయట పడు తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.