ఫోటో స్టోరి: పూల్ సైడ్ దేవకన్య గుబులుగా

Tue Jul 07 2020 09:00:20 GMT+0530 (IST)

Kiara Advani Stunning Pose In Swimming Pool

కియరా అద్వాణీ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియరా రెండో ప్రయత్నం `వినయ విధేయ రామ` ఫ్లాపవ్వడంతో టాలీవుడ్ వైపు చూడనే లేదు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో బిజీ నాయిక. ఇటీవల మరోసారి మహేష్ తన సరసన కియారాకి ఛాన్సిచ్చారని... ఎంబీ 27 కోసం పరశురామ్ కి కియరాను ఒప్పించారని ప్రచారమైంది.అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ లేదు. కీర్తి సురేష్ .. కియరా ఎవరో ఒకరిని ఫైనల్ చేసేందుకు ఆస్కారం ఉందని ప్రచారమవుతోంది. అదంతా అటుంచితే కియరా నటించిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హిందీలో వరుసగా నాలుగైదు చిత్రాలకు సంతకాలు చేసింది. త్వరలోనే కిలాడీ అక్షయ్ కుమార్ సరసన నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం లక్ష్మీ బాంబ్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కి కమిట్ మెంట్ ఇచ్చింది.

అయితే మహమ్మారీ లాక్ డౌన్ సమయంలో కియరా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంది? అంటే.. ఇదిగో ఇలా పూల్ సైడ్ ట్రీట్ తో సరిపుచ్చుతోంది. ఇన్ స్టాలో జిమ్ .. యోగా ఫోటోలు వీడియోలు సహా తన డాడ్ తో కజిన్స్ తో ఉన్నప్పటి ఫోటోలు షేర్ చేసింది. తాజాగా షేర్ చేసిన పూల్ సైడ్ ఫోటోలో కియరా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది. బహుశా మహమ్మారీ వైదొలగి తిరిగి పరిశ్రమ యథావిధిగా ఉంటే తన స్టార్ డమ్ అమాంతం స్కైని టచ్ చేయడం ఖాయమే కదా.. అని ఆలోచిస్తోందా..ఏమో!