ఫోటో స్టొరీ: రోడ్ పై నడుస్తున్న దేవత

Tue Sep 17 2019 10:16:24 GMT+0530 (IST)

'భరత్ అనే నేను' సినిమాలో నటించి కియారా అద్వాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పుడు అందరూ కియారాను ఒక బ్యూటిఫుల్ బాలీవుడ్ హీరోయిన్ అని  సరిపెట్టుకున్నారే కానీ త్వరలో క్రేజీ బ్యూటీగా మారుతుందని.. లస్టు భామగా జనాలకు షాక్ ఇస్తుందని ఊహించలేదు. ఊహించనివి జరగడమే కదా జీవితం. కియారా అంతటితో ఆగకుండా 'కబీర్ సింగ్' లో నటించడం.. ఆ సినిమాకాస్త బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారడంతో కియారా క్రేజ్ మరింతగా పెరిగింది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే కియారా ఫ్యాషన్ సెన్స్ మరో ఎత్తు.  సందర్భం ఏదైనా దానికి తగ్గ దుస్తులు ధరించి చూపరులను మాయలో పడేసి తనవైపు ఆకర్షించడంలో కియరా ఎక్కడో పీ హెచ్ డీ అయితే చేసే ఉంటుంది.  రీసెంట్ గా కియారా ముంబైలో బయట కనిపించింది.  ఇక ఫోటోగ్రాఫర్లు క్లిక్కు.. క్లిక్కుమని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో కళాత్మక నెటిజన్లకు అందుబాటులో ఉంచారు. ఇంకేముంది.. అందరూ కియారా ఫ్యాషన్ ను.. ఆ స్టైల్ ను.. ఆ యాటిట్యూడ్ ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో కియారా ఒక లైట్ కలర్ స్లీవ్ లెస్ ఇన్నర్ లాంటి టీ షర్టు ధరించింది. దానికి మ్యాచింగ్ గా క్రీం కలర్ త్రీ ఫోర్త్ ప్యాంట్ ధరించింది. వైట్ స్పోర్ట్స్ షూ ధరించి.. ఒక చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో పెద్ద బ్యాగ్ పట్టుకుని  చిరునవ్వులు చిందిస్తూ రోడ్ పై నడుస్తోంది. ఎలా ఉందంటే.. ఏకంగా ఏ రంభో లేదా ఊర్వశో కిందకు దిగి ఈ భూమిపై ఉండేవారిని ఏడిపించేందుకు సరదాగా నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఇక కియారా సినిమాల విషయానికి వస్తే 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' అనే నాలుగు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలతో బిజీగా ఉండడంతో సౌత్ లో క్రేజీ ప్రాజెక్టులలో ఆఫర్లు వచ్చినా డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో నో చెప్తోందట!