ఫొటో టాక్ ః మేకప్ లేకున్నా అందగత్తే

Fri Oct 15 2021 14:00:01 GMT+0530 (IST)

Kiara Advani Photo without makeup

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగు లో ఈమె వినయ విధేయ రామ మరియు భరత్ అనే నేను సినిమాలో నటించిన విషయం తెల్సిందే. భరత్ అనే నేను సూపర్ హిట్ అయినా కూడా వినయ విధేయ రామ అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో తెలుగు సినిమాలకు దూరం అయ్యింది. ఈ సమయంలో బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోయింది. చాలా కాలం తర్వాత సౌత్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. రామ్ చరణ్ కు జోడీగా ఈమె మరోసారి నటించబోతుంది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.తాజాగా ముంబయిలో ఈ అమ్మడు డాన్స్ ప్రాక్టీస్ చేసి బయటకు వస్తున్న సమయంలో ఇలా కెమెరా కంట చిక్కింది. మేకప్ లేకుండా చాలా నాచురల్ గా కియారాను ఇందులో చూడవచ్చు. మేకప్ లేకున్నా కూడా చాలా నాచురల్ గా కూల్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కియారా ఫొటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. ఈమె షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలు ప్రతి సారి కూడా అందరిని ఆకట్టుకుంటాయి. కాని ఈసారి మీడియా పంచుకున్న ఫొటోలు కూడా నాచురల్ బ్యూటీ అంటూ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో హీరోయిన్ లు డాన్స్ ప్రాక్టీస్ మరియు వర్కౌట్లు చాలా కామన్ విషయం. కొద్ది మంది ఆ సమయంలో ఫొటోలకు ఫోజ్ లు ఇచ్చేందుకు ఆసక్తి చూపించరు. కాని కియారా అద్వానీ మాత్రం మేకప్ లేకున్నా కూడా ఫొటోలకు ఫోజు ఇచ్చింది. స్పోర్ట్స్ బ్రా ధరించి స్కిన్ టైట్ ఫొటో తో ఆకట్టుకుంది. ఫేస్ లో కాస్త నీరసంగా ఉన్నా కూడా మంచి నాచురల్ బ్యూటీ అనిపించుకుంది. ఆకట్టుకునే ఫిజిక్ తో కియారా అద్వానీ అందగత్తె అనిపించుకుంటుంది.