మహేష్ సరసన కియరా కన్ఫామ్ కాదట!

Sun May 31 2020 10:33:45 GMT+0530 (IST)

Kiara Advani Not Confirm For Mahesh Babu Sarkaru Vaari Paata

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు SSMB 27 టైటిల్ ని ఖరారు చేశారు. `సర్కార్ వారి పాట` అనే టైటిల్ ని నేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా లాంచ్ చేశారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టెక్నీషియన్ల వివరాల్ని పోస్టర్ లో వెల్లడించినా ఇప్పటివరకూ అధికారికంగా కథానాయిక ఎవరు? అన్నది ప్రకటించలేదు. అసలింతకీ కథానాయిక ఎవరు? అంటే..ఇంతకుముందు కీర్తి సురేష్ .. కియరా అద్వానీ.. పూజా హెగ్డే అంటూ ప్రచారమైంది. కానీ ఇప్పటివరకూ ఎవరి పేరును ఫైనల్ చేయనేలేదట. వాస్తవానికి భరత్ అనే నేను ఫేం కియరానే అనుకున్నా కానీ బాలీవుడ్ లో ఊపిరి సలపని షెడ్యూళ్ల వల్ల ఇక్కడ వెంటనే కమిట్ మెంట్ ఇవ్వలేకపోయిందిట. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని ఎదురుచూస్తున్నా.. ఉత్తరాదిన హిందీ సినిమాల కాల్షీట్ల విషయమై క్లారిటీ మిస్సయ్యిందట. మహమ్మారీ లాక్ డౌన్ తో అన్ని సినిమాలు వాయిదాలు పడడంతో వాటిని పూర్తి చేయాల్సిన ప్రత్యేక సన్నివేశం తలెత్తింది.

దీంతో కియారా నిర్ణయం ఎటూ తేలకపోవడంతో పరశురాం అండ్ కో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారట. కీర్తి సురేష్ లేదా పూజా హెగ్డే ల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలన్న ఆలోచనా ఉందని తెలుస్తోంది. అయితే ఈ భామల కాల్షీట్లపైనా కాస్త క్లారిటీ రావాల్సి ఉందట. అలాగే ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి రెండో నాయికగా నటించనుందని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్-జీఎంబీ - 14 రీల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్ తమన్ స్వరకర్త కాగా.. పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఉగాది 2021 నాటికి రెడీ చేయాలన్న ప్లాన్ ఉందిట.