కిరాక్ పుట్టిస్తున్న రెండు జడల సీత ఎవరో?

Thu Nov 25 2021 12:20:06 GMT+0530 (IST)

Kiara Advani New Look

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఇటు టాలీవుడ్ ని తెలివిగా మ్యానేజ్ చేస్తోంది. దేశంలో టాప్ -1.. టాప్ 2 ఇండస్ట్రీల్లో అగ్రనాయికగా హవా సాగిస్తోంది.కియరా సోషల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో కియరా స్కూల్ గాళ్ గా మారిపోయింది. 16 ప్రాయం రెండు జడల సీతలా కనిపించింది. ఎప్పుడూ గ్లామర్ ఎలివేషన్ ఫోటోషూట్లతో హీటెక్కించే ఈ బ్యూటీ ఈసారి వాటికి దూరంగా ఉంటూ సింపుల్ గా రెండు జడలు వేసుకుని సెల్పీ దిగిన ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. కియారా అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది కియారా హెయిర్ స్టైల్ చూసి విగ్గు ధరించిందని గెస్ చేస్తున్నారు. ఈ గెటప్ లో ఇషా డియోల్ లా ఉందని మరికొంత మంది అభిమానులు కామెంట్ల రూపంలో తెలిపారు.

ఇక కియారా సినీకెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ సినిమా అంటే పాన్ ఇండియా అప్పీల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో కియారా ఈ అవకాశం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్.. టబు.. కియారా ప్రధాన పాత్రల్లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న`బూల్ భులాయా-2` అనే హారర్ కామెడీ చిత్రం నటిస్తోంది. మరోవైపు రాజ్ మెహతా దర్శకత్వంలో `జగ్ జగ్ జియో`లో నటిస్తోంది.

ఇటీవలే `షేర్ షా` చిత్రంతో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఆ సక్సెస్ తర్వాత మరిన్ని ప్రాజెక్ట్ లకు సంతకాలు చేసింది. ఇటీవలే కియారా `మిస్టర్ లీలే` చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసింది. బాలీవుడ్ లో కియరా ఫుల్ బిజీ నటిగా కొనసాగుతోంది. చరణ్ 15వ చిత్రంలోనూ అవకాశం అందుకుంది. శంకర్ తో ఆర్.సి 15 తన రేంజును పదింతలు చేయడం ఖాయమని కియరా నమ్ముతోంది. దీనికోసం బన్ని- తారక్ తో ఆఫర్ల ని సైతం ఖాతరు చేయని సంగతి తెలిసిందే.